Realme C63 5G Discount Offer: దసరా వచ్చింది.. ఆఫర్లు తెచ్చింది..realme C63 5G మొబైల్ పై ఏకంగా రూ.7 వేల తగ్గింపు.. ఎలా కొనాలంటే?

Realme C63 5G Discount Offer: అత్యధిక తగ్గింపుతో మంచి రియల్ మీ మొబైల్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్..దసరా సందర్భంగా ఫ్లిఫ్‌కార్ట్‌లో కొన్ని రియల్ మీ మొబైల్స్ పై ఊహించని డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. అలాగే ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Oct 11, 2024, 12:30 PM IST
Realme C63 5G Discount Offer: దసరా వచ్చింది.. ఆఫర్లు తెచ్చింది..realme C63 5G మొబైల్ పై ఏకంగా రూ.7 వేల తగ్గింపు.. ఎలా కొనాలంటే?

Realme C63 5G Discount Offer: దసరా సందర్భంగా అన్ని ఈ కామర్స్ కంపెనీల్లో ప్రత్యేకమైన సేల్స్ ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వస్తువులు అత్యధిక తగ్గింపు ధరతో లభిస్తున్నాయి.  ముఖ్యంగా ఈ సందర్భంలో స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేసే వారికి పెద్ద పండగే అని చెప్పవచ్చు. ఎందుకంటే అత్యధిక తగ్గింపు ధరతో అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్ పై ఏకంగా 30 నుంచి 40 శాతం వరకు కూడా తగ్గింపును అందిస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ  ఫ్లిఫ్‌కార్ట్‌లో కొన్ని మొబైల్స్ అయితే ప్రత్యేకమైన ఫ్లాట్ తగ్గింపుతో పాటు బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సేల్స్ లో భాగంగా  ఫ్లిఫ్‌కార్ట్‌లో ఏ స్మార్ట్ ఫోన్ అత్యధిక తగ్గింపు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి. 

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో realme C63 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారికి బంపర్ దసరా డిస్కౌంట్ లభించబోతోంది. ఈ మొబైల్ పై అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు మరెన్నో డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మొబైల్ ని ఇప్పుడే కొనుగోలు చేసే వారికి ఫ్లాట్ 14% వరకు తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ మొబైల్ రెండు కలర్ ఆప్షన్స్ తో పాటు నాలుగు స్టోరేజ్ వేరియంట్స్లో అందుబాటులో ఉంది. ఇందులోని మిడిల్ వేరియంట్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ లో భాగంగా 8GB రామ్ తో కూడిన మొబైల్   ధర రూ.13,999 కాగా.. ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లో భాగంగా దీనిని కొనుగోలు చేసే వారికి 14 శాతం ఫ్లాట్ తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ కేవలం రూ.11వేలకే పొందవచ్చు. 

ఇవే కాకుండా ఈ మొబైల్ పై ఆధారంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ మొబైల్ పై ఉన్న బ్యాంకు డిస్కౌంట్ వివరాల్లోకి వెళితే.. దీనిని యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసేవారికి ఏకంగా రూ.1700 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు లపై కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. వీటన్నింటినీ వినియోగించి కొనుగోలు చేసే వారికి ఈ మొబైల్ కేవలం రూ. 10వేలకే లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్ పై కొన్ని ప్రత్యేకమైన కాంబో ఆఫర్స్ కూడా అందుబాటులో. వీటిని వినియోగించి కూడా ప్రత్యేకమైన తగ్గింపు పొందుతూ కొనుగోలు చేయవచ్చు. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఇక ఈ realme C63 5G మొబైల్ పై ఉన్న ఎక్స్చేంజ్ ఆఫర్స్ వివరాలు కి వెళ్తే.. ఈ ఫోన్ కొనుగోలు చేసే క్రమంలో పాత మొబైల్ ను ఎక్స్చేంజ్‌ చేసి బిల్ చెల్లించే వారికి ఏకంగా రూ.7 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ తగ్గింపు అనేది పాత మొబైల్ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఎలాంటి డెంట్స్ లేకుండా పాత మొబైల్ ఉంటే దీనిపై ఫుల్ ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది అదే ఏదైనా స్క్రీన్ డెన్ట్స్, మొబైల్ దెబ్బ తినడం వంటి ప్రాబ్లమ్స్ ఉంటే రూ.7,000 కంటే తక్కువే ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ పై ఉన్న ఆఫర్స్ అన్నీ పోను దీనిని కేవలం రూ.2 వేలకే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ మొబైల్ పై అదనంగా ఎన్నో రకాల ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News