Redmi 14C: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Xiaomi మార్కెట్‌లోకి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ Redmi 14C పేరుతో కస్టమర్స్‌కి అందుబాటులోకి తీసుకు రానుంది. రెడ్‌మీ కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ముందుగా ఆగస్ట్ 31న వియత్నాంలో లాంచ్ చేయబోతున్నట్లు వెల్లడించింది. దీనిని కంపెనీ మిడిల్ క్లాస్ బడ్జెట్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఏయే ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతుందో, ధర, ఇతర పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లూ వేరియంట్ ఈ మొబైల్..
త్వరలోనే అందుబాటులోకి రాబోయే ఈ Redmi 14C స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు దీని బ్యాక్ సెటప్‌లో పెద్ద గుండ్రని కెమెరాను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ గతంలో లాంచ్ చేసిన మోడల్‌ను దృష్టిలో పెట్టుకుని తయారు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది ఇటీవలే లాంచ్ అయిన Oppo F27 5G మొబైల్ డిజైన్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తంది. అయితే దీనిని కంపెనీ బ్లూ వేరియంట్‌లో ముందుగా అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రీమియం మొబైల్ లాగా కనిపించేందుకు కంపెనీ దీనిని ప్రత్యేకమైన డిజైన్‌తో తీసుకు రాబోతోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సెటప్ వివరాల్లోకి వెళితే.. ఇది రౌండ్ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు ప్రీమియం సెకండరీ కెమెరాలతో అందుబాటులో భాగంగానే LED ఫ్లాష్ సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇది వేగన్ లెదర్ ఫినిషింగ్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.88-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీనిని కంపెనీ ముందుగా రెండు స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటుతోకి తీసుకు రానుంది.
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
6.88-అంగుళాల LCD డిస్‌ప్లే
HD+ రిజల్యూషన్
90Hz రిఫ్రెష్ రేట్
5160mAh బ్యాటరీ
18W చార్జింగ్ సపోర్ట్
సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
MediaTek Helio G91 Ultra ప్రాసెసర్
4GB ర్యామ్ + 128GB స్టోరేజ్
8GB ర్యామ్ + 128GB స్టోరేజ్
50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.