Redmi K80 Pro Launch Date In India: Xiaomi నుంచి మార్కెట్లోకి అద్భుతమైన స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతోంది. దీనిని కంపెనీ Redmi K80 Pro పేరుతో విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది. ఇక ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన బ్యాటరీతో పాటు అనేక రకాల ప్రీమియం ఫీచర్స్ తో మార్కెట్లోకి విడుదల ఎందుకు సిద్ధంగా ఉంది. దీనిని కంపెనీ ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాతో విడుదల చేయబోతోంది. ఇప్పటికే ఈ మొబైల్‌కు సంబంధించిన అనేక రకాల ఫీచర్స్ సోషల్ మీడియాలో వారిలో అవుతున్నాయి. అయితే ఇటీవల లీకైన ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Redmi K80 Pro స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ పూర్తి వివరాలు:
Redmi K80 Pro స్మార్ట్ ఫోన్ అత్యంత శక్తివంతమైన బ్యాటరీతో విడుదల కాబోతోంది. ఇది 6000mAh బ్యాటరీని కలిగి ఉండిపోతోంది. దీంతోపాటు ఇందులో ఇంకో మోడల్ 5000mAh బ్యాటరీ కలిగి ఉండే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మొబైల్ కు సంబంధించిన చార్జింగ్ సపోర్ట్ వివరాలు కి వెళ్తే.. ఇది 120W సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో లాంచ్ కాబోతోంది. అంతేకాకుండా 50W వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ను కూడా అందిస్తోంది. ఇక దీని బ్యాక్ సెట్ వివరాల్లోకి వెళితే.. ఇది అద్భుతమైన కెమెరా మాడ్యూల్ ని కలిగి ఉంటుంది. ఇందులోని ప్రధాన కెమెరా 50MPతో విడుదల కాబోతోంది. ఇక అదనంగా 32MP 120° అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరాలను కలిగి ఉంటుంది.
ఇక ఈ Redmi K80 Pro స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన డిస్ప్లే వివరాలు లోకి వెళ్తే.. 2K M9 OLED ఫ్లాట్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇక ఈ Redmi K80 Pro మొబైల్లోని డిస్ప్లే 6.67-అంగుళాలు కలిగి ఉంటుంది. దీంతోపాటు 3200×1440 రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో ఈ డిస్ప్లే వస్తోంది. ఇక దీని డిజైన్ గత మొబైల్స్ కంటే చాలా సన్నగా ఉంటుంది. ఇది ప్రీమియంలకు కనిపించేందుకు మెటల్ ఫ్రేమ్ సెట్ అప్ను కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చే ఏడాది మొదటి నెలలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
రెడ్మీ కంపెనీ ఈ Redmi K80 Pro మొబైల్లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ SoC కూడిన D1 గేమింగ్ ప్రాసెసర్‌ని అందుబాటులోకి తీసుకురాబోతోంది. అలాగే డ్యూయల్-లూప్ 3D ఐస్ కూలింగ్ సిస్టమ్ ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు IP69 రేటింగ్‌లతో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సెటప్‌తో విడుదల కాబోతోంది. ఇక ఇది Xiaomi డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ 2.0ను కూడా కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. ఇవే కాకుండా ఈ Redmi K80 Pro స్మార్ట్ ఫోన్ అతి శక్తివంతమైన ప్రీమియం ఫీచర్స్ ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.