Redmi Note 14 series: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్‌మీ త్వరలోనే అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను తమ కస్టమర్స్‌కి పరిచయం చేయబోతోంది. దీనిని కంపెనీ రెడ్‌మి నోట్ 14 సిరీస్ పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఈ సిరీస్‌ను కంపెనీ మూడు మోడల్స్‌లో అందుబాటులోకి తీసుకు రానుంది. ఇది కంపెనీ రెడ్‌మి నోట్ 14, నోట్ 14 ప్రోతో పాటు నోట్ 14 ప్రో ఫ్లస్ మోడల్స్‌లో రాబోతోంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ వివరాల్లోకి వెళితే, దీని బ్యాక్ సెట్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగిఆ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Redmi Note 14 సిరీస్ లాంచింగ్ తేది:
ఈ రెడ్‌మి నోట్ 14 సిరీస్‌లను కంపెనీ సెప్టెంబర్ చివరి వారంలో అందుబాటులోకి తీసుకు రానుంది. అంతేకాకుండా కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ వివరాల ప్రకారం.. కంసెనీ ఈ సిరీస్‌ను సెప్టెంబర్ 23 తేది నుంచి 29వ తేది వరకు ఎప్పుడైనా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా రెడ్‌మీ కంపెనీ త్వరలోనే ఈ మోడల్స్‌కి సంబంధించిన మొదటి సేల్‌ను కూడా త్వరలోనే ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ముందుంగా వీటిని చైనాలో అందుబాటులోకి తీసుకు వచ్చే ఛాన్సులు ఉన్నాయని అధికారిక సమాచారం.
ఈ Redmi Note 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ చైనాలో లాంచ్ అయితే.. ఇవి Xiaomi అధికారిక వెబ్‌సైట్‌లో పాటు చైనా ఈ కామర్స్ ఫ్టాట్‌ఫామ్స్ JD Mallతో పాటు Tmallలలో అందుబాటులోకి రానున్నాయి. అంతేకాకుండా కంపెనీ త్వరలోనే ఫ్రీబుకింగ్ ప్రక్రియకు సంబంధించిన అనౌంస్‌మెంట్ కూడా చెయ్యనుంది. దీని బ్యాక్ సెటప్‌లో అద్భుతమైన కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియం డిజైన్‌తో అందుబాటులోకి రానుంది. ఇక ఈ మొబైల్‌ను కంపెనీ అతి తక్కువ ధరల్లోనే కస్టమర్స్‌కి పరిచయం చేయనుంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
Redmi Note 14 సిరీస్ ఫీచర్లు:
వాటర్ రెసిస్టెన్స్‌తో టీజ్
IP68-రేటెడ్ బిల్డ్ సెటప్
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
50-మెగాపిక్సెల్ OIS ప్రధాన కెమెరా
AI కెమెరా ఫీచర్స్
Snapdragon 7s Gen 3 SoC ప్రాసెసర్
1.5K డిస్ప్లే
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.