Samsung Galaxy Z Flip: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో Samsung స్థానం ప్రత్యేకం. ఐఫోన్‌కు దీటుగా నమ్మకమైన బ్రాండ్ ఇది. అందుకే శాంసంగ్ ఫోన్లకు క్రేజ్ ఎక్కువ. Samsung నుంచి ఫోల్టబుల్ ఫోన్లు Samsung Galaxy Z Flip సిరీస్‌లో ఇప్పటివరకూ 5 వచ్చాయి. ఇప్పుడు మరో ఫోల్డబుల్ ఫోన్ Samsung Galaxy Z Flip 6 త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఫీచర్లు బయటకు వెల్లడయ్యాయి.
Samsung Galaxy Z Flip 6 ఇండియాలో లాంచ్ చేసేందుకు బీఐఎస్ సర్టిఫికేషన్ పొందింది. జూలై నెలలో లాంచ్ కావచ్చని అంచనా. ఈ ఫోన్‌లో కెమేరా FV-5లైనప్‌తో ఉంటుంది. 12.5 మెగాపిక్సెల్ రిజల్యూషన్‌తో ప్రైమరీ కెమేరా సెన్సార్ ఉంటుంది. ఇక మెయిన్ కెమేరా 50 మెగాపిక్సెల్‌తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్లతో ఉంటుందని తెలుస్తోంది. Samsung Galaxy Z Flip 5 కంటే మెరుగైన 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా ఉండటం విశేషం. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా 6.75 జీబీ ర్యామ్‌తో పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్ ప్రోసెసర్ కలిగి ఉంటుంది. Samsung Galaxy Z Flip 5 కంటే డిస్‌ప్లే పరిమాణం పెద్దదే ఉంటుంది. ఇక పిక్చర్ క్వాలిటీ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. ఇక ఈ ఫోన్ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
Samsung Galaxy Z Flip 6 ఇంటర్నల్ స్టోరేజ్ 256 జీబీ, 512 జీబీతో ఉంటుంది. ర్యామ్ అయితే 8జీబీ, 12జీబీ రెండు ఆప్షన్లలో ఉంటుంది. Samsung Galaxy Z Flip 6 ఈవెంట్ ఈ ఏడాది జూలై 10 న ఉండవచ్చు. ఇండియాలో లాంచ్ తేదీ, ఇతర ఫీచర్లు కూడా అదే రోజు వెల్లడి కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook