Simple One Electric Scooter: మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్స్‌ను దృష్టిలో పెట్టుకుని చాలా కంపనీ అద్భుతమైన బైక్స్‌ను లాంచ్ చేస్తూ వస్తున్నాయి. అయితే ప్రముఖ కంపెనీ సింపుల్ ఎనర్జీ కూడా అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఇది అద్భుతమై ఫీచర్స్‌తో లాంచ్ అయ్యింది. ఇది 248 కిమీ మైలేజీతో లాంచ్ అయ్యింది. అయితే ఈ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ స్కూటర్ సింపుల్ వన్ అనే పేరుతో అందుబాటులోకి వచ్చింది. అలాగే కంపెనీ ఈ స్కూటర్‌కి సంబంధించిన ధర వివరాలను కూడా పేర్కొంది. ఇది ధర రూ.1.66 లక్షలతో లభిస్తోంది. అంతేకాకుండా వేరియంట్‌ను బట్టి కంపెనీ వీటి ధరలను నిర్ణియించింది. ఇది వివిధ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా అనేక రకాల కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది.
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో స్పెషల్ యాప్ ఇంటిగ్రేషన్, నావిగేషన్‌తో పాటు స్పెషల్ రైడ్ మోడ్స్, పార్క్ అసిస్ట్, ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌లను అందిస్తోంది. ఇవే కాకుండా ఇందులో ఆటో-బ్రైట్‌నెస్ ఫంక్షనాలిటీని అందిస్తోంది. ఈ స్కూటర్‌లో డాష్‌బోర్డ్ థీమ్, వెహికల్ లొకేటర్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌ను కూడా సింపుల్ వన్ కంపెనీ ఈ స్కూటర్‌ను అందిస్తోంది. అలాగే దూర ప్రయాణాలు చేసే క్రమంలో మొబైల్ ఛార్జ్ చేసేందుకు USB ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా అందిస్తోంది.
Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత
అలాగే ఇందులో కంపెనీ 750W ఛార్జర్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. ఈ స్కూటర్ 2.77 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కి.మీ వరకు గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుది. ఇక ఇందులో స్పెషల్‌గా సీటు కింద 30 లీటర్ల సామర్థ్యంతో కూడిన స్పెస్‌ను కూడా అందిస్తోంది. ప్రస్తుతం ఈ స్కూటర్స్‌కి సంబంధించిన స్టోర్‌లను భారత దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల ప్రారంభించింది. అయితే త్వరలోనే ఈ కంపెనీకి సంబంధించిన కొత్త 200 స్టోర్లను ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి