Techno Poa 6 5G: 108MP ప్రధాన కెమెరాతో కొత్త Techno Poa 6 5G మొబైల్‌ వస్తోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇవే!

Techno Poa 6 5G Smartphone: మార్కెట్‌లోకి త్వరలోనే టెక్నో పోవా 6 5G స్మార్ట్‌ఫోన్‌ రాబోతోంది. దీనికి సంబంధించిన టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ఫీచర్స్‌, స్పెషిఫికేషన్‌ డిటెయిల్స్‌ ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Feb 13, 2025, 05:02 PM IST
Techno Poa 6 5G: 108MP ప్రధాన కెమెరాతో కొత్త Techno Poa 6 5G మొబైల్‌ వస్తోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇవే!

Techno Poa 6 5G Smartphone: ప్రముఖ మొబైల్ కంపెనీ టెక్నో మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో స్పెషల్ డిజైన్‌తో విడుదల కానుంది. ఈ టెక్నో పోవా 6 5G స్మార్ట్‌ఫోన్‌ శక్తివంతమైన కెమెరాతో విడుదల కానుంది. అలాగే ఇది పెద్ద బ్యాటరతో పాటు ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ మొబైల్‌కి సంబంధించిన టీజర్‌ను కూడా కంపెనీ సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

టెక్నో పోవా 6 5G మొబైల్‌కి సంబంధించిన కెమెరా వివరాల్లోకి వెళితే.. దీని బ్యాక్‌ సెటప్‌లో 108MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా దూరంలో ఉన్న ఆబ్జెక్ట్‌ను కూడా క్లిక్‌ చేసేందుకు 3x జూమ్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. టెక్నో కంపెనీ ఈ మొబైల్‌లో అద్భుతమైన కెమెరా సెన్సార్స్‌ను కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన డిస్ప్లే చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఇందులో కంపెనీ స్పెషల్ డిస్ప్లే ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుందని తెలిపింది. ఈ మొబైల్ టీజర్‌లో "డైనమిక్ పోర్ట్ 2.0" గురించి కూడా పేర్కొన్నారు. 

ఈ టెక్నో పోవా 6 5G స్మార్ట్‌ఫోన్‌లో మోస్ట్‌ పవర్‌ఫుల్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఒక్కరోజు ఛార్జ్‌ దాదాపు రోజుంతా బ్యాక్‌గా ఉంటుంది. అలాగే ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వస్తోంది. ఈ మొబైల్‌ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. ప్రీమియం లుక్‌లో కనిపించేందుకు వివిధ కలర్‌ ఆప్షన్స్‌లో విడుదకానుంది. ఇక దీనిని కంపెనీ మొదటగా 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత

ఈ మొబైల్ 5G సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. దీని ద్వారా 5G సేవలు మరింత వేగవంతంగా వినియోగించవచ్చు. ఇక కంపెనీ టీజర్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ప్రాసెసర్‌ గురించి ఇంక వెల్లడించలేదు.. కానీ దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన చిప్‌సెట్‌తో విడుదల చేసే అవకాశాలు  ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన విడుదల  తేది వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ మొదట కొలంబియాలో లాంచ్ చేయనుంది. ఆ తర్వాత భారత్‌లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. 

Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News