Whatsapp on Users' Data Leak News: 50 కోట్ల మంది యూజర్స్ డేటాను విక్రయానికి పెట్టినట్టు వస్తోన్న వార్తలపై వాట్సాప్ స్పందించింది. వాట్సాప్ సంస్థ 50 కోట్ల మంది మొబైల్ నెంబర్స్ అమ్మకానికి పెట్టినట్టు ఆరోపిస్తూ సైబర్ న్యూస్ ఓ వార్తా కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తను వాట్సాప్ ఖండించింది. సైబర్ న్సూస్ రాసిన కథనంలో వాస్తవం లేదన్న వాట్సాప్.. ఆ కథనంలో పొందుపర్చిన స్క్రీన్ షాట్స్ సైతం నిరాధారమైనవి అని పేర్కొంది.
2022 ఏడాదికి సంబంధించిన 48.7 కోట్ల వాట్సాప్ యూజర్స్ డేటాను విక్రయించనున్నట్టు హ్యాకర్స్‌కి బాగా తెలిసిన ఓ హ్యాకింగ్ ఫోరంలో వాట్సాప్ ఓ అడ్వర్టైజ్మెంట్ పోస్ట్ చేసిందని సైబర్ న్యూస్ తమ కథనంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.
84 దేశాలకు చెందిన వాట్సాప్ యూజర్స్ మొబైల్ నెంబర్స్ ని వాట్సాప్ అమ్మకానికి పెట్టినట్టు సైబర్ న్యూస్ కథనం వెల్లడించింది. ఇటలీ, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, సౌది అరేబియా దేశాలకు చెందిన వాట్సాప్ యూజర్స్ ఈ స్కామ్ లో బాధితులుగా ఉన్నట్టు సైబర్ న్యూస్ స్పష్టంచేసింది.
ఏయే దేశాల్లోంచి ఎంతమంది మొబైల్ నెంబర్స్ అమ్మకానికి ఉన్నాయనే వివరాలను కూడా వెల్లడిస్తూ 32 మిలియన్ల మంది అమెరికన్ వాట్సాప్ యూజర్స్, 35 మిలియన్ల మంది ఇటలీలోని వాట్సాప్ యూజర్స్, 11 మిలియన్లకు పైగా బ్రిటిష్ వాట్సాప్ యూజర్స్, 10 మిలియన్ల వరకు రష్యాకు చెందిన వాట్సాప్ యూజర్స్ డేటా బ్రీచ్ అయినట్టు సైబర్ న్యూస్ ఆరోపించింది. ఇదే సైబర్ న్యూస్ చీఫ్ ఎడిటర్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. వాట్సాప్ డేటా హ్యాక్ ( Whatsapp ) అయినట్టుగా ఎలాంటి ఆధారం లేదని.. కాకపోతే రిస్కుని కొట్టిపారేయలేమని ప్రకటించడం గమనార్హం.
Also Read : Buying TV, Cars, Fridges: ఇప్పుడు టీవీలు, కార్లు, ఫ్రిడ్జిలు కొంటున్నారా ?
Also Read : HDFC Bank Story: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఎలా ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు
Also Read : Flipkart Offers: వావ్.. రూ. 24 వేల Samsung Galaxy F23 5G స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 17 వేలకే.. లిమిటెడ్ అఫర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook