Lord Sri Ram Idol Vandalise: తెలంగాణలో ఆలయాలపై దాడులు ఆగడం లేదు. కొందరు దుండగులు ఆలయాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు వరుస సంఘటనలు కనిపిస్తున్నాయి. తాజాగా మరో ఆలయంలో దాడి జరిగింది. శ్రీరాముడి విగ్రహం కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఫలితంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. విగ్రహం ధ్వంసంతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సంఘటన సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read: Gaddar Award: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. 'ఎంతో మందిని చంపిన వ్యక్తి గద్దర్'
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్‌లోని రామాలయం ఉంది. ఈ రామాలయంలో ఉన్న రాముడి విగ్రహన్ని సోమవారం కొందరు వ్యక్తులు ధ్వసం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేయడం జిల్లాలో కలకలం రేపింది. ఈ ఘటనపై హిందూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ భక్తులు, హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా మానేరు బ్రిడ్జిపై బీజేపీ, ఏబీవీపీ నాయకులు ధర్నాకు దిగారు.
Also Read: Govt Employees: పీఆర్సీ పత్తా లేదు.. రిటైర్మెంట్ డబ్బుల్లేవ్.. ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
మానేరు వాగు బ్రిడ్జిపై భక్తులు ధర్నాకు దిగి ఆందోళన చేపట్టారు. రాముడి విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని బీజేపీ, ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. వీరి ఆందోళనతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కాగా నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ, ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటనతో సిరిసిల్లలో కొంత ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆలయాన్ని పరిశీలించినట్లు సమాచారం. అయితే ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.