AP 10th Results 2024: ఏపీ టెన్త్ ఫలితాల్లో ఓ విద్యార్థిని ఎవరికి సాధ్యం కాని ఫీట్ ను సాధించింది. పదో తరగతి ఫలితాల్లో ఏకంగా 600 మార్కులకు గాను 599 మార్కులు తెచ్చుకుని ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు ఆమె పేరు నెట్టింట మార్మోగిపోతుంది. ఆ ఒక్క మార్పు ఎక్కడ పోయింది అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఆ విద్యార్థిని ఎవరంటే ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగ సాయి మనస్వి. పదో ఫలితాల్లో ఈమె 600కు గాను 599 మార్కులు తెచ్చుకుని స్టేట్ టాపర్ గా నిలిచింది. హిందీ సబ్జెక్టులో తప్ప మిగతా అన్ని సబ్జెక్టుల్లో వందకు వంద మార్కులు తెచ్చుకుంది మనస్వి. హిందీలో వందకు 99 మార్కులు వచ్చాయి. టెన్త్ రిజల్ట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినట్లు ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది. దీంతో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఏపీ పదో తరగతి ఫలితాలను ఏప్రిల్ 22 ఉదయం 11 గంటలకు విడుదల చేశారు అధికారులు. టెన్త్ ఫలితాల్లో 6.16 లక్షల మంది రెగ్యులర్ విద్యార్ధుల్లో 86.69 శాతం (5,34,574 ) మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో బాలురు బాలురు 84.02 శాతం, బాలికలు 89.17 శాతం ఉత్తీర్ణత సాధించారు. మునుపటిలాగే అబ్బాయిలు కన్నా అమ్మాయిలే ఎక్కువ మంది పాస్ అయ్యారు. ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా అత్యధిక ఉత్తీర్ణత( 96.37) శాతంతో తొలి స్థానంలో నిలిచింది. 62.47 శాతం ఉత్తీర్ణత సాధించి కర్నూలు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి 30 వరకు జరిగాయి.
Also Read: 10th Class: 10th క్లాస్ తర్వాత ఈ కోర్సులు చేస్తే విద్యార్ధుల భవిష్యత్తుకు తిరుగుండదు..
Also Read: AP SSC Result 2024 Live: అయ్యో.. ఆ స్కూల్స్‌లో అందరూ ఫెయిల్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook