Dasara 2020 celebrations హైదరాబాద్: దసరా ఉత్సవాలలో భాగంగా వరంగల్‌లో ఈనెల 17 నుంచి 26వ తేదీ వరకు జరిగే భద్రకాళీ దేవి శరన్నవరాత్రుల వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( CM KCR ) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ని కలిసిన దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు.. భద్రకాళి ఆలయంలో ( Bhadrakali temple Dasara celebrations ) ఎంతో వైభవంగా జరిగే దసరా ఉత్సవాలకు హాజరై అమ్మవారి అనుగ్రహం పొందాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు. దసరా ఉత్సవాలకు రావాల్సిందిగా కోరుతూ వారు ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు. భద్రకాళి ఆలయం ఈఓ సునీత, సూపరింటెండెంట్ విజయ్ కుమార్, అర్చకులు నాగరాజు శర్మ ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. Also read : Sabarimala temple: అయ్యప్ప భక్తులకు ముఖ్య గమనిక
ఇదిలావుంటే, ఇటీవలే ఏపీ సీఎం క్యాంపు ఆఫీసులో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ( AP CM YS Jaganmohan Reddy ) కలిసిన ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు, విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్ధానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పైలా సోమినాయుడు, దుర్గ గుడి ఈవో ఎంవి సురేష్ బాబు, ఆలయ అర్చకులు.. విజయవాడలో దుర్గమ్మ తల్లి సన్నిధిలో జరిగే దసరా వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. వారి ఆహ్వానం మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 21న రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ( Vijayawada Durga temple ) అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. Also read : YV Subba Reddy: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కరోనా పాజిటివ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe