Vijayashanti On BJP Leaders: బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్‌లో చేరుతున్నారంటూ ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. సీడబ్ల్యూసీ సమావేశాలకు సోనియా గాంధీ హైదరాబాద్‌కు రాగా.. పార్టీలకు అతీతంగా ఆమె గౌరవిస్తామని విజయశాంతి ట్వీట్ చేశారు. దీంతో ఆమె కాంగ్రెస్ వైపు చూస్తున్నారనంటూ ప్రచారం ఊపందుకుంది. తాజాగా ఈ వార్తలపై రాములమ్మ స్పందించారు. చిట్ చాట్‌ల పేరుతో ఏదో ఒక వ్యూహంతో చేసే కార్యాచరణ తనకు అలవాటు లేదంటూ ట్వీట్ చేశారు.
"చిట్ చాట్‌ల పేరుతో ఏదో ఒక వ్యూహంతో చేసే కార్యాచరణ నాకు అలవాటు లేదు. పార్టీకి ఏది ముఖ్యమో ఆ అంశాలను పార్టీ ప్రధాన నాయకులకు ఈ నెల 16న ముఖ్య సమావేశంలో నేను స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఆ విషయాలు బయటకు లీకేజ్‌ల పేరుతో ఇయ్యడానికి నేను వ్యతిరేకిని.. ఇదంతా తెలిసి కూడా కొంతమంది మా పార్టీలోని నేతలు పనిగట్టుకుని బీజేపీకి రాములమ్మ దూరం అంటూ నాపై సోషల్ మీడియా ద్వారా చేయిస్తున్న ప్రచారం తప్పక ఖండంచదగ్గది.." అంటూ విజయశాంతి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో కాంగ్రెస్‌లో రాములమ్మ చేరిక ప్రచారానికి చెక్ పెట్టినట్లయింది.
Also Read: Emergency Alert Message: మీ మొబైల్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా..? అసలు విషయం ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook