Ponguleti Srinivasa Reddy-Komatireddy Rajgopal Reddy Meet: ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీ క్రమంగా బలం పుంజుకుంటోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీలోకి రాకతో వచ్చే ఎన్నికల్లో విజయంపై ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు బీజేపీ కూడా నాయకత్వంలో మార్పులు చేసింది. బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీ తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ నియమితులయ్యారు. బీజేపీ అగ్రనాయకత్వం కీలక మార్పులు చేస్తున్న సమయంలో రాష్ట్రంలో నాయకులు షాక్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరతారనే ప్రచారం తెలంగాణ రాజకీయా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఆయన భేటీ అయినట్లు సమాచారం. అజీజ్‌నగర్‌లో ఉన్న పొంగులేటి ఫామ్ హౌస్‌లో ఇద్దరు నేతలు భేటీ అయినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో కాంగ్రెస్‌లో చేరికపై రాజగోపాల్ రెడ్డి చర్చించారనే అంశం తెరపైకి వచ్చింది. గతంలోనే ఇలాంటి రూమర్లు వచ్చినా రాజగోపాల్ రెడ్డి తోసిపుచ్చారు. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తిరిగి హస్తం గూటికి చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో తెలంగాణలోనూ ఫుల్ జోష్ వచ్చింది. ఇక్కడ కూడా తిరిగి పుంజుకుంటామని ఆ పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలు తిరిగి మళ్లీ వస్తారని అంటున్నారు. బీజేపీలో ప్రాధాన్యత తగ్గట్లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి తమ పార్టీలోకి చేరతారని హస్తం పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇటీవల కోమటిరెడ్డిని ఢిల్లీకి పిలిపించుకున్న బీజేపీ అధిష్టానం.. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చింది.
అయితే నేడు ప్రకటించిన పార్టీ కమిటీల్లో ఈటలకు కీలక పదవి దక్కగా.. రాజగోపాల్ రెడ్డికి నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలోనే ఆయన పొంగులేటి శ్రీనివాస రెడ్డితో భేటీ అయినట్లు ప్రచారం ఊపందుకుంది. త్వరలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నుంచి కీలక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు.
Also Read: AP Pension Scheme: జగన్ సర్కారు శుభవార్త.. త్వరలో రెండో పెన్షన్..?
Also Read: BJP New Presidents: బీజేపీ అధిష్టానం సంచలన నిర్ణయం.. బండి సంజయ్, సోము వీర్రాజు అధ్యక్షులుగా తొలగింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook