హైదరాబాద్: లక్షలు, కోట్లు కుమ్మరించి వ్యాపారం చేసే చోట ఎలుకలు కనిపిస్తే.. ఎలుకే కదా అని లైట్ తీసుకోవద్దు అని నిరూపించిన ఘటన ఇది. ఎందుకంటే ఒక ఎలుక చేసిన పనికి ఓ వ్యక్తి కోటి రూపాయలకుపైగా నష్టపోవాల్సి వచ్చింది ( Rat caused major fire accident ). హైదరాబాద్‌లోనే చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. దాదాపు ఆరు నెలల క్రితం.. అంటే ఈ ఏడాది ఫిబ్రవరి 8న ముషీరాబాద్‌లోని మిత్రా మోటార్స్ అనే ఓ కార్ సర్వీస్ సెంటర్లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం ( Fire accident ) జరిగిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఆ సర్వీస్ సెంటర్ యజమాని కోటికిపైగా నష్టపోయాడు. అప్పట్లో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు.. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే ( Short circuit ) కారణమై ఉంటుందని తేల్చేశారు. ఐతే ఈ అగ్ని ప్రమాదం జరిగిన సర్వీస్ సెంటర్లో సీసీటీవీ విజువల్స్‌ని క్షుణ్ణంగా పరిశీలించిన ఓ ప్రముఖ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరి ( Forensic science labs ).. ఈ అగ్ని ప్రమాదానికి అసలు కారణం షార్ట్ సర్క్యూట్ కాదు.. ఎలుకే ఈ ఆఫీసు కొంపకు నిప్పటించింది అని తేల్చేశారు. వినడానికి కాస్త విచిత్రంగానే ఉన్నప్పటికీ ఎలుకే ఈ అగ్ని ప్రమాదానికి కారణమైందనే ఆధారాలతో కూడిన ఫోటోలను సదరు ఫోరెన్సిక్ సైన్స్ సంస్థ బయటపెట్టింది. Also read : IPL 2020 logo: ఐపిఎల్ 2020 కొత్త లోగో వచ్చేసింది
భారీ అగ్నిప్రమాదం జరిగిన ఆఫీసులో ఫిబ్రవరి 7న ఉదయం 10 గంటలకు పూజ ( Pooja ) కోసం ఓ ఉద్యోగి దీపం వెలిగించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో ( CCTV camera ) నమోదయ్యాయి. గదిలో పెద్దగా గాలి వీయకపోవడంతో ఆ దీపం రాత్రి వరకు ఆరకుండా అలా వెలుగుతూనే ఉంది. రాత్రి వేళ ఆఫీస్ మూసేసి సిబ్బంది ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. ఆ తర్వాతే అసలు ఘోరం జరిగిపోయింది. Also read : SP Balasubrahmanyam: విషమంగానే బాలు ఆరోగ్య పరిస్థితి
అర్ధరాత్రి 11:51 సమయంలో సర్వీస్ సెంటర్లోని కస్టమర్ సర్వీస్ రూంలో ఓ టేబుల్‌పై ఎలుక ( Rat in office ) తచ్చాడుతూ కనిపించింది. 11:55కి ఆ ఎలుక నిప్పులాంటి వస్తువు నోట కర్చుకుని తిరిగిన దృశ్యాలు కూడా సీసీటీవీలో రికార్డయ్యాయి. అలా ఆ ఎలుక ఆ నిప్పు లాంటి వస్తువును తీసుకెళ్లి ఓ కుర్చీపై వదిలేయడం కూడా ఈ దృశ్యాల్లో ( CCTV visuals ) కనిపించింది. అది బహుశా పూజ కోసం వెలిగించిన దీపంలోని వొత్తి అయ్యుంటుందని.. ఆ తర్వాత 5 నిమిషాల వ్యవధిలోనే కుర్చీలో మంటలు ఎగిసిపడటం.. ఆ అగ్నికీలలు సర్వీస్ సెంటర్ లోని ఫర్నిచర్ మొత్తానికి వ్యాపించడం క్షణాల్లోనే జరిగిపోయిందని ఫోరెన్సిస్ సైన్స్ ల్యాబ్ అభిప్రాయపడింది. Also read : COVID-19: ఏపీలో 3000 దాటిన కరోనా మృతుల సంఖ్య
అలా వ్యాపించిన మంటలు కింది అంతస్తుకు కూడా అంటుకోవడంతో అక్కడే సర్వీస్ కోసం ఇచ్చిన మూడు కార్లు, ఖరీదైన ఫర్నిచర్ కాలి బూడిదయ్యాయి. దీంతో సర్వీస్ సెంటర్ యజమానికి కోటి రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది.
ఇంత పెద్ద భారీ అగ్నిప్రమాదం వెనుక ఓ చిన్న ఎలుక ఉందంటే ఆశ్చర్యంగానే ఉంది కదూ..!! Also read : MS Dhoni reply to PM Modi: ప్రధాని లేఖపై స్పందించిన ధోనీ