GHMC Elections: టీఆర్ఎస్‌పై ఛార్జిషీటు విడుదల చేసిన కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరు ఊపందుకుంటుంది. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అరాచకాలపై బీజేపీ ఛార్జిషీటు విడుదల చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ చేరుకున్న కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ ఛార్జిషీటు విడుదల చేశారు.

Last Updated : Nov 22, 2020, 02:01 PM IST
GHMC Elections: టీఆర్ఎస్‌పై ఛార్జిషీటు విడుదల చేసిన కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరు ఊపందుకుంటుంది. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అరాచకాలపై బీజేపీ ఛార్జిషీటు విడుదల చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ చేరుకున్న కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ ఛార్జిషీటు విడుదల చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో( Greater Hyderabad Elections ) బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల ( BJP Star Campaigners )ను రంగంలో దించుతోంది. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ( Central minister prakash javadekar ) హైదరాాబాద్ చేరుకుని..టీఆర్ఎస్ ( TRS ) అవినీతి అరాచచకాలపై ఛార్జిషీటు విడుదల చేశారు. బీజేపీ మేయర్ కావాలా లేదా ఎంఐఎం మేయర్ ( MIM Mayor ) కావాలో హైదరాబాద్ ప్రజలు తేల్చుకోవాలని సూచించారు. హైదరాబాద్ మేయర్ పీఠం బీజేపీ దక్కించుకోబోతోందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ జోస్యం చెప్పారు. కేసీఆర్, ఒవైసీ ( Owaisi ) కుటుంబపార్టీల్నించి హైదరాబాద్ ను రక్షించుకోవాలన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ కు ఓటేస్తే..ఎంఐఎంకు ఓటేసినట్టేనని ప్రకాశ్ జవదేకర్ అభిప్రాయపడ్డారు. దుబ్బాక ఫలితమే గ్రేటర్ ఎన్నికల్లో పునరావృతం కానుందని చెప్పారు. 

హైదరాబాద్ నగరాన్ని డల్లాస్ నగరంగా చేస్తామని చెప్పి వరదల నగరంగా చేశారని విమర్సఇంచారు. లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల  నిర్మాణంలో కేసీఆర్ ప్రభుత్వం ( Kcr Government ) విఫలమైందని చెప్పారు. కరోనా సమయంలో ప్రజల్ని గాలికొదిలేసి కేసీఆర్ ఫాంహౌస్ లో పడుకున్నారని కేంద్రమంత్రి జవదేకర్ ఆరోపించారు. ఆయుష్మాన్ భారత్ పధకం అమలు చేసుంటే పేదలకు చికిత్స ఉచితంగా అంది ఉండేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర కీలకమని గుర్తు చేశారు. సుష్మా స్వరాజ్ ప్రస్తుతం లేకపోయినా..ఆమె చేసిన పోరాటం మర్చిపోలేమన్నారు. Also read: GHMC Elections 2020: తెరాస ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు- కిషన్ రెడ్డి

Trending News