TTD Chairman: టీటీడీ చైర్మన్‌గా బీఆర్‌ నాయుడు.. 24 మంది పాలక మండలి సభ్యులు వీరే!

BR Naidu Along With 24 Members Appointed As Chairman And Board Members: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియమితులయ్యారు. ఆయనతోపాటు పాలకమండలి సభ్యులు కూడా నియామకమయ్యారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 30, 2024, 07:47 PM IST
TTD Chairman: టీటీడీ చైర్మన్‌గా బీఆర్‌ నాయుడు.. 24 మంది పాలక మండలి సభ్యులు వీరే!

TTD New Committee: తిరుమల తిరుపతి దేవస్థాననాన్ని ప్రక్షాళన చేయాలని భావించిన చంద్రబాబు ప్రభుత్వం కొత్త పాలకమండలిని నియమించింది. తిరుమలపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు తిరుమల దేవస్థానానికి కొత్త పాలకమండలిని నియమించారు. టీటీడీ చైర్మన్‌గా బీఆర్‌ నాయుడును ప్రభుత్వం నియమించగా.. ఆయనతోపాటు 24 మందిని పాలకమండలి సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: Free Gas Cylinder: మహిళలకు దీపావళి పండుగే.. ఉచిత గ్యాస్‌ సిలిండర్లకు చెక్కు అందజేత

మొత్తం 25 మందితో ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు లభించగా.. తెలంగాణ నుంచి ఐదుగురికి, కర్ణాటక నుంచి ముగ్గురికి స్థానం లభించింది. తమిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి అవకాశం లభించింది. సుచిత్ర ఎల్ల మరోసారి సభ్యురాలిగా నియమితులవడం విశేషం. కాగా ఏపీలో కూటమి ప్రభుత్వం ఉండడంతో టీటీడీ బోర్డులో కూడా కూటమి నాయకులకు ప్రాధాన్యం లభించింది.

టీటీడీ బోర్డు చైర్మన్‌: బీఆర్‌ నాయుడు

టీటీడీ సభ్యులు
జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంఎస్‌ రాజు, పనబాక లక్ష్మి, నర్సిరెడ్డి, జాస్తి పూర్ణ సాంబశివరావు, నన్నపనేని సదాశివరావు, కృష్ణమూర్తి, కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌, జంగా కృష్ణమూర్తి, ఆర్‌.ఎన్‌.దర్శన్‌, జస్టిస్‌ హెచ్‌.ఎల్‌.దత్‌, పి.రామ్మూర్తి, తమ్మిశెట్టి జానకీదేవి, బి.మహేందర్‌రెడ్డి, అనుగోలు రంగశ్రీ, సుచిత్ర ఎల్లా, బూరగపు ఆనందసాయి, నరేశ్‌ కుమార్‌, డా.అదిత్‌ దేశాయ్‌, సౌరభ్‌ హెచ్‌ బోరా

కమిటీ విశేషాలు:
టీటీడీ సభ్యులైన ఎమ్మెల్యేలు వీరే: ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట), వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (కోవూరు), ఎంఎస్‌ రాజు (మడకశిర)

తెలంగాణ నుంచి సభ్యులైన వారు: నన్నూరి నర్సిరెడ్డి, బుంగునూరు మహేందర్‌ రెడ్డి, అనుగోలు రంగశ్రీ, బూరగాపు ఆనందసాయి, సుచిత్ర ఎల్ల

పాలకమండలిలో కర్ణాటక నుంచి దర్శన్‌ ఆర్‌ఎన్‌, జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌, నరేశ్‌ కుమార్‌కు స్థానం లభించింది. ఇక తమిళనాడు నుంచి కృష్ణమూర్తి, గుజరాత్‌ (డాక్టర్‌ అదిత్‌ దేశాయ్‌), మహారాష్ట్ర (శ్రీ సౌరభ్‌ హెచ్‌ బోరా) ఒక్కొక్క స్థానం దక్కింది.|

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News