Pending Traffic Challans: తెలంగాణలో వాహనదారుల పెండింగ్ చలాన్లపై పోలీస్ శాఖ ఇచ్చిన డిస్కౌంట్ ఆఫర్‌కు భారీ స్పందన లభించింది. మార్చి 1 నుంచి ప్రారంభమైన ఈ డిస్కౌంట్ ఆఫర్ నిన్నటితో (ఏప్రిల్ 15) ముగిసింది. ఈ 45 రోజుల వ్యవధిలో రాష్ట్ర ఖజానాకు రూ.302 కోట్లు జమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5 కోట్ల పెండింగ్ చలాన్లు ఉండగా... వీటిల్లో 3 కోట్ల చలాన్ల చెల్లింపులు జరిగాయి. మొత్తం పెండింగ్ చలాన్ల సొమ్ము రూ.1015 కోట్లు కాగా... డిస్కౌంట్ పోను రూ.302 కోట్లు ప్రభుత్వానికి చేరింది.
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ చలాన్ల సొమ్మును వసూలు చేసేందుకు పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్ పేరిట డిస్కౌంట్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ ప్రకారం... ద్విచక్ర వాహనదారులకు 75 శాతం, ఆర్టీసీ బస్సులకు 30 శాతం, తోపుడు బండ్లకు 20 శాతం రాయితీ ఇచ్చారు. తొలుత మార్చి 1 నుంచి మార్చి 30 వరకే ఈ ఆఫర్‌ను ప్రకటించినప్పటికీ... ఆ తర్వాత వాహనదారుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు మరో 15 రోజుల పాటు గడువు పొడగించారు.
ఆన్‌లైన్ లేదా మీ సేవా కేంద్రాల ద్వారా పెండింగ్ ఈ-చలాన్లు చెల్లించే వెసులుబాటు కల్పించారు. డిస్కౌంట్ పోను మిగతా మొత్తాన్ని మాఫీ చేశారు. ఒక్క హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలోనే పెండింగ్ చలాన్ల ద్వారా రూ.600 కోట్లు సొమ్ము రావాల్సి ఉండటంతో... పోలీస్ శాఖ ఈ డిస్కౌంట్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత రెండేళ్లుగా కరోనా ప్రభావంతో ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పెండింగ్ చలాన్లపై రాయితీ నిర్ణయం తీసుకున్నట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ చలాన్లు చెల్లించనివారిపై కఠిన చర్యలు తప్పవని పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది.
Also Read: Suicide in Metro Station: ఢిల్లీ మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన ఆ యువతి మృతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook