Ramoji Rao Hospitalised: తెలుగు మీడియా మొఘల్‌గా పేరుపొందిన ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీ రావు అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారని సమాచారం. ఈ వార్తతో మీడియా రంగంలో కలకలం రేపింది. అతడి ఆరోగ్యం ఎలా ఉందని మీడియాతోపాటు రాజకీయ ప్రముఖులు ఆరా తీస్తున్నారు. 87 ఏళ్ల రామోజీ రావు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గతంలో కూడా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందారు.
Also Read: Chandrababu: ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసే స్థలం ప్రత్యేకత ఏమిటో తెలుసా?
అస్వస్థతకు గురయిన రామోజీరావును నానక్ రామ్ గూడలోని స్టార్ ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. ఆయనకు వెంటిలేటర్ మీద వైద్యం అందిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో రామోజీకి వైద్య సేవలు అందుతున్నాయి. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది మాత్రం ఇప్పటివరకు వైద్యులు వెల్లడించలేదు. 24 గంటలు గడిస్తే కానీ అతడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసే అవకాశం ఉంది. కాగా రామోజీ రావు మీడియాతోపాటు అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈనాడు సంస్థలు, రామోజీ ఫిల్మ్ సిటీ, మార్గదర్శి చిట్‌ఫండ్స్, ప్రియా ఫుడ్స్ వంటి వ్యాపార సామ్రాజ్యాన్ని రామోజీ రావు నడిపిస్తున్నారు. తెలుగు మీడియాలో ప్రధానమైన ఈనాడు సంస్థ ఆయన ఆధ్వర్యంలోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Also Read: Chandrababu Promises: గెలిచారు సరే.. చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు నిలబెట్టుకుంటారా?
తెలుగు రాజకీయాల్లో రామోజీరావు కీలక పాత్ర వహిస్తున్నారు. తాజాగా ఏపీ ఎన్నికల్లో ఈనాడు ప్రధాన భూమిక పోషించింది. గత ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ పరోక్షంగా త్వరలో కొలువుదీరనున్న కూటమి ప్రభుత్వానికి సహకరించారు. ఇక కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రామోజీ రావుకు మధ్య అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ నేరుగా ఈనాడు పేరు ప్రస్తావిస్తూ రామోజీ రావుపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇలా ఏపీ రాజకీయాల్లో రామోజీ పేరు తీసివేయలేనిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter