BC Meeting In Kamareddy: తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ అధికారానికి దూరమై 14 నెలలు దాటింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫామ్‌హౌస్‌కే పరిమితం అయినా గులాబీ కేసీఆర్.. ఇప్పటివరకు బయటకు రాలేదు.. త్వరలోనే కేసీఆర్ బయటకు వస్తారని బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నా.. ఎప్పుడు వస్తారనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.. కానీ రాష్ట్రంలో బీసీల కోసం నిర్వహించే భారీ బహిరంగ సభ ద్వారా కేసీఆర్ బయటకు రాబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే కామారెడ్డి జిల్లాలో బీసీ బహిరంగ సభను నిర్వహించబోతున్నట్టు బీఆర్‌ఎస్ పార్టీ ప్రకటించింది.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుట BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక డిమాండ్ పెట్టారు. మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం కులగణన రీసర్వే చేపడితే కేసీఆర్ సహా అందరం అందులో పాల్గొంటామని సవాల్ చేశారు. మొన్న చేసిన కులగణన సర్వే మొత్తం తప్పుల తడకగా ఉందని విమర్శించారు. బీసీల గొంతు కోసేలా ప్రభుత్వం వ్యవహరించిందని అన్నారు. బీసీ జనాభా ను ఐదున్నర శాతం తగ్గించారని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కులగణన సర్వే తమకు చిత్తు కాగితంతో సమానమని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ బీసీ నేతలతో సమావేశమైన మంత్రి కేటీఆర్ శాస్త్రీయంగా మళ్లీ రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు.
ఇటీవల బీఆర్‌ఎస్ ముఖ్య లీడర్లతో ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ భేటీలో తాను మౌనంగా ఉన్నారని.. తాను కొడితే ఎంత బలంగా ఉంటుందో చూడాలన్నారు. అంతేకాదు రైతు రుణమాఫీ, రైతు భరోసా నిధులు ఇవ్వడంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఫెయిల్ అయ్యిందని విమర్శించారు. అయితే త్వరలోనే తాను ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నట్టు ప్రకటించారు. తన సొంత ఇలాకాలో ఓ భారీ బహిరంగ సభను నిర్వహించి అక్కడి నుంచి సమరశంఖం పూరించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగానే.. కామారెడ్డి కేంద్రంగా మరో సభను కూడా తలపెట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. ఈ రెండు సభల ద్వారా తిరిగి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బీసీ నేతల మీటింగ్‌లో కేటీఆర్ క్లారిటీ ఇచ్చారని సమాచారం.
మొత్తంగా గజ్వేల్ వేదికగా రైతు గర్జన సభను ప్లాన్ చేసిన బీఆర్‌ఎస్.. కామారెడ్డి కేంద్రంగా బీసీ గర్జన సభకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే గజ్వేల్ సభను మాత్రం దాదాపు 5 లక్షల మందితో నిర్వహించబోతున్నారట. మరోవైపు రాష్ట్రంలో బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. కులగణలో బీసీల జనాభాను తక్కువ చేసి చూపించారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన వేదికనే ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీ వాడుకోవాలని లెక్కలు వేసుకుంటోందట. మొత్తం మీద ఈ రెండు సభల ద్వారా కేసీఆర్ రీ ఎంట్రీ ఖాయమైందని గులాబీ లీడర్లు ఖుషీ ఖుషీ అవుతున్నట్టు తెలిసింది.
Also Read: ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
Also Read: Gold Rate Today: అందనంత ఎత్తుకు బంగారం ధరలు.. తులం లక్ష దిశగా పరుగులు.. నేటి ధరలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.