Himanshu Rao KCR: మనవడికి వ్యవసాయం నేర్పుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ తాతయ్య

Ex CM KCR Teaches Agriculture To His Gran Son Himanshu Rao Video Viral: సంక్రాంతి పండుగ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన మనమడికి హిమాన్షు రావుకు వ్యవసాయం నేర్పించారు. ఈ సందర్భంగా తన ఫామ్‌ హౌస్‌లో మనమడితో కేసీఆర్‌ పనులు చేయించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 16, 2025, 03:54 PM IST
Himanshu Rao KCR: మనవడికి వ్యవసాయం నేర్పుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ తాతయ్య

  KCR Himanshu Rao: బయట గొప్ప రాజకీయ నాయకుడు.. తెలంగాణ తెచ్చిన యోధుడు అయినా కూడా కుటుంబసభ్యులకు అతడు మాత్రం ఓ తండ్రి.. ఓ తాత. రాజ్యానికి రాజైనా కన్నతల్లికి కొడుకు అన్నట్టు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా కుటుంబం విషయంలో ఓ సాధారణ తాతనే. కుటుంబానికి అమితంగా ప్రేమించే బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు తన మనమడు హిమాన్షు రావుతో విడదీయరాని అనుబంధం ఉంది. తాతతో ఎప్పుడూ ఉండేందుకు హిమాన్షు ఇష్టపడుతాడు. అలాంటి హిమాన్షుకు అతడి తాత మాజీ సీఎం కేసీఆర్‌ వ్యవసాయం నేర్పించారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ హిమాన్షుతో మొక్క నాటించారు.

Also Read: Sreemukhi: మరో వివాదంలో శ్రీముఖి.. ఇంద్రకీలాద్రిపై రీల్స్‌, ఫొటోషూట్‌తో హల్‌చల్‌

సంక్రాంతి సందర్భంగా విదేశాల నుంచి హిమాన్షు స్వరాష్ట్రం వచ్చాడు. ఈ క్రమంలోనే తన తాత వద్దకు వెళ్లాడు. పండుగ సందర్భంగా కేసీఆర్‌ తెల్లటి పట్టు వస్త్రాలు ధరించి.. తలపై టోపి పెట్టుకుని కనిపించారు. పంచెకట్టులో ఉన్న కేసీఆర్‌ మనమడు హిమాన్షుకు మొక్కను ఎలా నాటాలో నేర్పించారు. హిమాన్షు చేతితో పారా పట్టి గుంత తవ్వించారు. అనంతరం మామిడి మొక్కను మనవడితో నాటించారు. ఎరువు వేసి మొక్క బాగా పెరిగేలా కేసీఆర్‌ సూచనలు చేశారు.

Also Read: Harish Rao: రేవంత్ రెడ్డి రాజకీయ కుట్రతో 'సంక్రాంతి' కూడా చేసుకోనివ్వరా?

మొక్క నాటిన అనంతరం మొక్కకు నీళ్లు పోసి.. పాదు చేశాడు. అయితే హిమాన్షు తప్పుగా చేస్తుండడంతో వీపుపై కేసీఆర్‌ ఒక దెబ్బ వేశారు. అనంతరం మొక్కను సరిగా నాటాడు. దీనికి సంబంధించిన వీడియోను హిమాన్షు తన సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. 'వాతావరణ మార్పులకు అనుగుణంగా సహజ వనరులను కాపాడడం.. పరిరక్షించడం మన బాధ్యత. అత్యుత్తమైనది నేర్చుకున్నా' అని హిమాన్షు పోస్టు చేశాడు. ఆ వీడియోను చూసిన బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, శ్రేణులు ముచ్చటపడుతున్నారు. తాత మనవళ్ల అనుబంధం చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ తన మనవడితో ఉన్న అనుబంధాన్ని ఇది చాటుతోందని కామెంట్లు చేస్తున్నారు. మరో కేసీఆర్‌లా హిమాన్షు అవుతాడని మరికొందరు చెబుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News