Hanuman Temple Issue: తెలంగాణలో హిందువులను రెచ్చగొట్టే పనుల జరుగుతున్నాయి. కేవలం పిచ్చోళ్లకు హిందూ దేవాలయాలే టార్గెట్ గా కనిపిస్తున్నాయి. వారి వేరే మతస్తులకు సంబంధించిన కట్టడాల జోలికి పోకపోవడం చూస్తే ఒక పథకం ప్రకారం హిందూ మందిరాలే టార్గెట్ గా కొంత మంది ముష్కరులు ఈ పనులు చేస్తున్నట్టు రూఢీ అవుతుంది. కానీ పోలీసులు మాత్రం ఈ కేసును ఏదో రకంగా క్లోజ్ చేసే పనిలో పడ్డారు. ఘటనపై దర్యాప్తు చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. తాజాగా హైదరాబాద్ పాత బస్తీ టప్పాచబుత్ర పరిధిలోని హనుమాన్ ఆలయంలోకి మాంసం ముద్దను అక్కడకు తీసుకువెళ్ళింది. ఓ పిల్లి అని పోలీసులు తేల్చారు. ఇందుకు అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ని విడుదల చేశారు.
మొత్తం 17 సీసీ కెమేరాల డేటాను పరిశీలించాక ఇది పిల్లి చేసిన పనే అని తేల్చారు. కాగా టప్పాచబుత్ర జిర్ర హనుమాన్ ఆలయంలోని శివ లింగం వెనుక మాంసం ఉండటాన్ని గుర్తించారు భక్తులు. ఆలయంలో మాంసం చూసి కంగుతున్న భక్తులు..పోలీసులకు వెంటనే సమాచారం అందించారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు...ఘటనపై విచారణ చేపట్టారు. ఈ విషయం తెలియటంతో హిందూ సంఘాలు హనుమాన్ టెంపుల్ దగ్గరకు భారీగా చేరుకుని ఆందోళన చేపట్టాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తాజాగా జరిగిన ఘటన వెనక పిల్లి ఉందని పోలీసులు తేల్చారు. మొత్తంగా పిల్లులతో పాటు పిచ్చోళ్లకు అందరికి హిందు దేవాలయాలే అప్పనంగా దొరికాయా అనే ముచ్చట వినిస్తోంది.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.