Indian Railways: ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రెండు రైళ్లు ఎదురైనప్పుడు కచ్చితంగా ప్రమాదమే జరుగుతుంది కదా. దేశంలో ఈ తరహా రైలు ప్రమాదాలు ఎక్కువే. ఇకపై ఈ పరిస్థితి ఉండదు. ఎదురెదురుగా రైళ్లు వచ్చినా..ప్రమాదం జరగదంట..ఆ వివరాలు పరిశీలిద్దాం..
భారతీయ రైల్వే శాఖ అత్యాధునిక వ్యవస్థను సరికొత్తగా రూపొందించింది. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ టెక్నాలజీకు కవచ్ అని పేరుపెట్టారు. దేశంలో తొలిసారిగా తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ టెక్నాలజీను స్వయంగా పరీక్షించారు. భారతీయ రైల్వే సరికొత్తగా అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీతో పదివేల ఏళ్లలో ఒకసారి మాత్రమే తప్పు జరగవచ్చని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ఈ టెక్నాలజీతో ఇకపై ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురైనా ప్రమాదం జరగదు. ఆ పరిస్థితి తలెత్తదు. అదెలాగంటే..
రెడ్ సిగ్నల్ పట్టించుకోకుండా లోకో పైలట్ అలాగే రైలును తీసుకెళుతుంటే..ఈ కవచ్ వ్యవస్థతో ఆటోమెటిగ్గా బ్రేకులు పడతాయి. పట్టాలు బాగా లేనప్పుడు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు, ఎదురెదురుగా రైళ్లు వస్తున్నప్పుడు కూడా వెంటనే గుర్తించి రైలును ఆపుతుంది. వంతెనలు, మలుపులు ఉన్నచోట పరిమితికి మించిన వేగంతో రైలు వెళ్తున్నా సరే..కవచ్ వ్యవస్థ వెంటనే స్పందించి..రైలు వేగాన్ని నియంత్రిస్తుంది.
ఈ వ్యవస్థను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణణ్ స్వయంగా పరీక్షించారు. ఓ రైలులో మంత్రి అశ్వినీ వైష్ణవ్, మరో రైల్లో రైల్వే బోర్డు ఛైర్మన్ వినయ్ కుమార్ త్రిపాఠీ ప్రయాణించారు. ఈ రెండు రైళ్లు లింగంపల్లి-వికారాబాద్ సెక్షన్‌లో ఎదురెదురయ్యాయి. అంతే రెండు రైళ్ల మద్య 380 మీటర్ల దూరం ఉండగా కవచ్ గుర్తించి..బ్రేకులు వేసింది. రైళ్లు ఆగిపోయాయి. వంతెనలు, మలుపులు ఉన్నచోటైతే..రైలు వేగాన్ని 30 కిలోమీటర్లకు పరిమితం చేసింది. ఈ సాంకేతికతను త్వరలో 2 వేల కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్ పరిధిలో తీసుకురానున్నట్టు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల వెల్లడించారు. ఇందుకు అనుగుణంగానే రైల్వే శాఖ కీలక చర్యలు చేపట్టింది.
Also read: Jagithyala Mla Dance: నడిరోడ్డుపై జగిత్యాల ఎమ్మెల్యే డ్యాన్స్‌తో సందడి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook