TARGET KCR FAMILY: ఈడీ చేతిలో కేసీఆర్ ఫ్యామిలీ బినామీల చిట్టా? బడాబాబుల అరెస్ట్ తప్పదా?

TARGET KCR FAMILY: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? కల్వకుంట్ల కుటుంబ సభ్యుల బినామీల చిట్టా కేంద్ర దర్యాప్తు సంస్థల చేతిలో ఉందా? బడాబాబులు జైలుకు వెళ్లడం తప్పదా? అంటే తెలంగాణలో  తాజాగా  జరుగుతున్న పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది.

Written by - Srisailam | Last Updated : Sep 20, 2022, 09:59 AM IST
TARGET KCR FAMILY: ఈడీ చేతిలో కేసీఆర్ ఫ్యామిలీ బినామీల చిట్టా? బడాబాబుల అరెస్ట్ తప్పదా?

TARGET KCR FAMILY:  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? కల్వకుంట్ల కుటుంబ సభ్యుల బినామీల చిట్టా కేంద్ర దర్యాప్తు సంస్థల చేతిలో ఉందా? బడాబాబులు జైలుకు వెళ్లడం తప్పదా? అంటే తెలంగాణలో  తాజాగా  జరుగుతున్న పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది. కేంద్ర మంత్రులు సహా తెలంగాణ బీజేపీ నేతలు పదేపదే చెబుతున్నట్లుగానే కేసీఆర్ కుటుంబానికి చెందిన ముఖ్యులు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమంటున్నారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో కేంద్ర దర్యాప్థు సంస్థలు దూకుడు పెంచాయి. సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయి. చిన్న చేపకు గాలం వేస్తే తిమింగలమే చిక్కినట్లు.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత లింకులు బయటపడటంతో సీబీఐ, ఈడీ రంగంలోకి దిగాయి. అయితే లిక్కర్ స్కాంలో తీగ లాగితే.. కేసీఆర్ ఫ్యామిలీ బినామీల డొంక కదులుతోందని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ అధికారులు సోమవారం బిల్డర్ వెన్నమనేని శ్రీనివాస్ ను అదుపులోనికి తీసుకోవడం కలకలం రేపుతోంది. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలానికి చెందిన శ్రీనివాస్.. ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ రావుకు అత్యంత సన్నిహితుడని గుర్తించారు. దీంతో కేసీఆర్ ఫ్యామిలీకి శ్రీనివాస్ ను బినామీగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి కవితకు సీఏగా వ్యవహరిస్తున్నగోరంట్ల బుచ్చిబాబు నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. దాదాపు ఆరు గంటల పాటు సాగిన సోదాల్లో బుచ్చిబాబు ఇంట్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. బుచ్చిబాబు ఇచ్చిన సమాచారం ఆధారంగానే సోమవారం ఈడీ బృందాలు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశాయి. మూడు ఐటీ సంస్థలు, రెండు రియల్ ఎస్టేట్ కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించాయి. ఉప్ప‌ల్ లోని డీఎస్ఎల్ మాల్ సాఫ్ట్ వేర్ కంపెనీ, సాలిగ్రామ్ సంస్థల్లోనూ ఈడీ అధికారులు త‌నీఖీలు చేశారు. మాదాపూర్ లోని వరుణ్ సన్ సంస్థలో సెర్చ్ చేశారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని వెన్నమనేని శ్రీనివాస్ ఇంట్లోనూ సోదాలు జరిగాయి. ఐదు గంటల తనిఖీల తర్వాత వెన్నమనేనిని అదుపులోనికి తీసుకున్నారు. వెన్నమనేని తన సంస్థల ద్వారా మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఈడీ దర్యాప్తులో తేలిందని అంటున్నారు. శ్రీనివాస్ నెలకొల్పి ఐటీతో పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో రాజకీయ ప్రముఖులు పెట్టుబడులు పెట్టారని.. బ్లాక్ మనీని వైట్ చేసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సీఐ బుచ్చిబాబు డెైరెక్షన్ లోనే శ్రీనివాస్ కేంద్రంగా ఈ అక్రమ దందా సాగిందని తెలుస్తోంది. వెన్న‌మ‌నేని వెనుక ఎవరెవరు ఉన్నారు.. ఎలా పెట్టుబడులు పెట్టారన్న వివరాలు ఆరా తీస్తున్నారని సమాచారం.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏ14గా నిందితుడిగా ఉన్న మద్యం వ్యాపారి ఆదివారం సాయంత్రం రామచంద్రన్ పిళ్లైని 7 గంటల పాటు విచారించారు ఈడీ అధికారులు. అతను ఇచ్చిన వివరాలతో మరిన్ని సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ టెండర్లలో కీలక పాత్ర పోషించారని భావిస్తున్న రామచంద్రన్ కు ఎమ్మెల్సీ కవితతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. కవిత ఫ్యామిలీతో కలిసి రామచంద్రన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఫోటోలు బయటికి వచ్చాయి. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు లింకులు ఉన్నాయనే అనుమానాలు బలపడ్డాయి. కవితకు సన్నిహితులుగా ఉన్న బోయినపల్లి అభిషేక్, సూదిని సృజన్, గండ్ర మోహన్ రావు నివాసాలు, కార్యాలయాల్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. అభిషేక్ గతంలో కవితకు పీఏగా పని చేశారని తెలుస్తోంది. సూదిని సృజన్, కవితలు ఎడికోర్ సంస్థలో కొన్నేళ్లపాటు డైరెక్టర్లుగా ఉన్నారు. ప్రస్తుతం ఆ సంస్థ మనుగడలో లేకపోయినా సృజన్ వ్యాపారాల్లో కవిత పెట్టుబడులు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈడీ దాడుల్లో ఇందుకు సంబంధించిన ఆధారాలు లభించాయని చెబుతున్నారు.   

గత నెలలో ఫీనిక్స్ సంస్థ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. అంతకుముందు వాసవి గ్రూప్ కార్యాలయాల్లోనూ ఐటీ దాడులు జరిగాయి. ఈ రెండు సంస్థల చైర్మెన్లకు మంత్రి కేటీఆర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఫీనిక్స్ గ్రూపులో కేటీఆర్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. వాసవి గ్రూప్ తోను కేటీఆర్ కు లింకులు ఉన్నాయంటున్నారు. మొత్తంగా తెలంగాణలో జరుగుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులతో కేసీఆర్ ఫ్యామిలీకి ఉచ్చు బిగుస్తుందని అంటున్నారు. త్వరలోనే కీలక నేతల అరెస్టులు ఉండవచ్చంటున్నారు.

Also Read : Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో మరో సంచలనం.. రామచంద్రన్ ను ప్రశ్నించిన ఈడీ.. నెక్స్ట్ కవితేనా?

Also Read : Hyderabad Liberation day Live Updates : ఎంఐఎం రజాకార్ల పార్టీనే.. బీజేపీ అసలు మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీనే! సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News