Telangana Elections 2018 : రేవంత్‌రెడ్డి ఇలాఖాలో దుమ్మురేపిన కేసీఆర్

కొడంగల్ నియోజకవర్గంలో నిర్వహించిన టీఆర్ఎస్ ఆశీర్వాదసభలో కేసీఆర్ ఉద్వేగంగా ప్రసంగించారు

Last Updated : Dec 4, 2018, 05:56 PM IST
Telangana Elections 2018 : రేవంత్‌రెడ్డి ఇలాఖాలో దుమ్మురేపిన కేసీఆర్

రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ లో నిర్వహించిన టీఆర్ఎస్ ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై పరోక్షంగా సెటర్లు సంధించారు. ఈ నియోజకవర్గంలో గాలికి తిరిగే వాళ్లు కొందరు ఉన్నారు. వాళ్లు మాటలు తప్పితే చేతల మునుషులు కారు.. అలాంటి వారికి ఓటు వేస్తే అంతే సంగతులు అంటూ రేవంత్ అభ్యర్ధిత్వాన్ని ఎద్దేవ చేశారు. కొండగల్ తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆలోచించి  ఓటు వేయాలని కొండగల్ ప్రజలను కోరారు. ఇక్కడ రెండే రెండు పక్షాలు ఉన్నాయి.. తెలంగాణ వ్యతిరేక పక్షం.. తెలంగాణ ఆంకాక్షలకు అనుగుణంగా పనిచేసే పార్టీ. పాలమూరు జిల్లా ప్రయోజనాలతో ఆటలాడుకునే చంద్రబాబుకు మద్దతు ఇచ్చే మహాకటమికి ఓటు వేస్తారో..ఎత్తిపోతల పథకం ద్వారా మీ జిల్లాను సశ్యస్యామలం చేసే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తారో  ప్రజలే నిర్ణయించుకోవాలని కేసీఆర్ సూచించారు. ఖర్మ కొద్ది మహాకూటమి గెలిస్తే పాలమూరు జిల్లా ఎడాదిగా మారుతుందని ఈ సందర్బంగా కేసీఆర్ హెచ్చరించారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం Vs  గత ప్రభుత్వాలు

ఓటు వేసే సమయంలో ప్రభుత్వాల పనితీరును బేరీజు వేసుకోవాలని ప్రజలకు కేసీఆర్ సూచించారు. ఇప్పుటి టీఆర్ఎస్ పాలన ఎలా ఉందో..గత 55 ఏళ్ల పాలించిన టీడీపీ,కాంగ్రెస్ పార్టీలు ఎలా పనిచేశాయో జనాలు బేరీజు వేసుకోవాలని కేసీఆర్ కోరారు. మేం వెయ్యి ఫించన్ ఇస్తున్నాం...మళ్లీ అధికారంలోకి వస్తే 2 వేలు ఇస్తాం.. గత ప్రభుత్వాలు ఇచ్చాయా ? అలాగే కల్యాణ్ లక్ష్మి పథకం ద్వారా వధువు కుటుంబానికి లక్ష ఆర్ధిక సాయం ఇస్తున్నాం.. దేశంలో ఎక్కడైనా ఎవరైనా ఇస్తున్నారా ?. మిషన్ బగీరథ ద్వారా మీకు నీరు అందుతోంది..ఈ పథకం ఎక్కడైనా ఉందా..24 గంటల పాటు కరెంట్ ఇస్తున్నాం..గతంలో ఎవరైనా ఇలా ఇచ్చారా ? ఐక్యరాజ్యసమితి ప్రశంసించిన రైతు బంధు పథకం అమలు చేస్తున్నాం..రైతులకు 24 గంటకలు కరెంట్ సరఫరా చేస్తున్నాం ..రైతు భీమా అమలు చేస్తున్నాం..రైతుల విషయం తాము తీసుకుంటున్న చర్యలు గత ప్రభుత్వాలు తీసుకున్నాయా ? అంటూ తన ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాల  తీరును పోల్చుతూ కేసీఆర్ వివరణ ఇచ్చారు

Trending News