Group 4 Recruitment 2022: నిరుద్యోగులకు కేసీఆర్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. వీటిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆర్థికశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 25 శాఖల్లోని 91 విభాగాల్లో ఖాళీగా ఉన్న 6,859 జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో పాటు పురపాలక శాఖలో 1,862 వార్డు అధికారుల పోస్టులు, ఆర్థికశాఖ, పురపాలకశాఖలో 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, ఆడిట్‌శాఖలో 18 మంది జూనియర్ ఆడిటర్ల నియామకానికి ఆర్థికశాఖ పచ్చజెండా ఊపింది. ఈ ఉద్యోగాల భర్తీకి టీఎస్సీపీఎస్సీ చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హారీశ్ రావు ఆశావహులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈనేపథ్యంలో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను కూడా భర్తీ చేసేందుకు టీఎస్సీపీఎస్సీ రెడీ అవుతోంది. కొత్త పోస్టులను చేరుస్తూ రీసెంట్ గా రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. గతంలో సర్కారు గ్రూప్ 2లో 663, గ్రూప్ 3లో 1373 పోస్టులను గుర్తిస్తూ ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరికొన్న కేటగిరీ పోస్టులను అందులో చేర్చారు. ఈ నేపథ్యంలో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేయనుంది. అయితే తాజాగా డివిజనల్ అకౌంట్స్ అధికారులు (వర్క్స్) గ్రేడ్-2 పోస్టులకు సంబంధించిన రాతపరీక్షను వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Also Read: Lawyers Protest: న్యాయమూర్తుల బదిలీపై నిరసన, రోడ్డెక్కిన న్యాయవాదులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook