Raj Pakala: బావమరిది రేవ్‌ పార్టీలో కేటీఆర్‌, ఆయన భార్య శైలిమ లేరు

KT Rama Rao And His Wife Not Present Brother In Law Party: బావ మరిది పార్టీ రేవ్‌ పార్టీ కాదని.. కుటుంబసభ్యులు చేసుకున్న విందు అని.. ఆ పార్టీలో కేటీఆర్‌, ఆయన సతీమణి లేరని బీఆర్‌ఎస్‌ పార్టీ స్పష్టం చేసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 27, 2024, 03:14 PM IST
Raj Pakala: బావమరిది రేవ్‌ పార్టీలో కేటీఆర్‌, ఆయన భార్య శైలిమ లేరు

KTR Brother In Law: తెలంగాణలో కలకలం రేపిన కేటీఆర్‌ బావ మరిది పార్టీ వ్యవహారంపై ప్రభుత్వం చేస్తున్నదంతా హడావుడి.. డ్రామా అని బీఆర్‌ఎస్‌ పార్టీ పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా.. కుట్రపూరితంగా కేటీఆర్‌పై ప్రభుత్వం లేనిపోనివి చేస్తోందని మండిపడింది. ఇంట్లో చేసుకున్న విందును రేవ్‌ పార్టీగా చెబుతూ కేటీఆర్‌ పరువును తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. గృహ ప్రవేశం చేసుకున్న తర్వాత కుటుంసభ్యులతో చేసుకున్న విందుగా పేర్కొంది. ఆ పార్టీలో కేటీఆర్‌, ఆయన భార్య శైలిమ లేరని స్పష్టం చేసింది. కేటీఆర్ బావ మరిది పార్టీపై బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌తోపాటు పాడి కౌశిక్‌ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు స్పందిస్తూ మాట్లాడారు.

Also Read: Rave Party Latest Live Updates: మాజీమంత్రి కేటీఆర్‌ బావ మరిది ఫామ్‌హౌస్‌ రేవ్‌ పార్టీ లైవ్‌ అప్‌డేట్స్‌..

రేవంత్ డైవర్షన్‌ పాలిటిక్స్‌
'కేటీఆర్‌ను ఇరికించాలని రేవంత్‌ ప్రయత్నం చేస్తున్నారు. హామీలు ఇచ్చి మాట తప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కేటీఆర్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారు' ఎమ్మెల్యే వివేకానంద్‌ తెలిపారు. రేవంత్ రెడ్డికి ప్రజల్లో ఆదరణ తగ్గుతోందన్నారు. కేటీఆర్‌పై అసూయతో వ్యక్తిగతంగా రేవంత్ దూషణలు చేస్తున్నారని మండిపడ్డారు. 'కేటీఆర్ బావమరిది సొంత ఇంట్లో కుటుంబసభ్యులతో పార్టీ ఏర్పాటు చేసుకున్నారు' అని వివరించారు.

Also Read: KTR: ఢిల్లీకి డబ్బుల మూటలు పంపేందుకు రేవంత్‌ రెడ్డి మూసీ నది జపం

'రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలేశారు. అతడికి కేటీఆర్ సిండ్రోమ్ పట్టుకుంది. కేటీఆర్ ఫోబియా పట్టుకుంది' అని ఎమ్మెల్యే వివేకానంద్‌ తెలిపారు. 'స్వయంగా రాజ్ పాకాల ఇంటికి పోలీసులు, ఆబ్కారీ అధికారులు వెళ్లి తనిఖీలు చేశారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్ పాకాల కుటుంబసభ్యులను పోలీసులు ఇబ్బంది పెట్టారు. అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు' అని మండిపడ్డారు.

'అలాంటి అధికారులను రిటైర్ అయినా మేము అధికారంలోకి వచ్చాక ఇబ్బంది పెట్టిన అధికారులను వదలం' అని ఎమ్మెల్యే వివేకానంద్‌ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని మండిపడ్డారు. 'సొంత ఇంట్లో పార్టీ చేసుకోవద్దా?' అని ప్రశ్నించారు. 'పంచనామా రిపోర్టులో ఫారెన్ లిక్కర్ ఉన్నట్లు తేలింది. మా ఎమ్మెల్యే ఇటీవల ప్రయివేటు పార్టీకి వెళ్లి వస్తుంటే ఇరికించే ప్రయత్నం చేశారు. రాజ్ పాకాల కొత్త ఇల్లు కట్టుకుని గృహ ప్రవేశం చేశారు. రాజ్ పాకాల ఇంట్లో కేటీఆర్, ఆయన సతీమణి లేరు' అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

'ఇలాంటి ప్రచారంతో కేటీఆర్‌ను మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. రేవంత్ డైవర్షన్‌లో ఇది జరుగుతోంది. రేవంత్ రెడ్డి చీకటి మిత్రుడు బండి సంజయ్ ముందుగానే స్పందిస్తున్నారు. బండి సంజయ్, రఘునందన్ రావుతో రేవంత్ రెడ్డి మాట్లాడిస్తున్నారు. రేవంత్, బండి సంజయ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. రేవంత్‌కు సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు' అని ఎమ్మెల్యే వివేకానంద్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మితిమీరి పని చేసిన అధికారుల చిట్టా రాసుకుంటామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి పచ్చిమోసగాడు అని మండిపడ్డారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook

Trending News