KTR Delhi Elections: 'రేవంత్ రెడ్డి అడుగుపెట్టడంతో ఢిల్లీలో గుండు సున్నా వచ్చింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ఓడించాడు. అతడు ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి' అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ పనులు చూసి ఢిల్లీ ప్రజలు నమ్మలేదని చెప్పారు. దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు పూర్తి స్పష్టత వచ్చింది. బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధించగా.. ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర ఓటమిని చవిచూడగా.. కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికలపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ఓటమి.. బీజేపీ గెలుపుపై కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. రాహల్ గాంధీతోపాటు రేవంత్ రెడ్డిపై కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Also Read: Ration Cards: ప్రజలకు భారీ శుభవార్త.. మీ సేవలో రేషన్ కార్డు దరఖాస్తులు
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై 'ఎక్స్' వేదికగా కేటీఆర్ స్పందించారు. 'రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు. ఢిల్లీలో బీజేపీని మరోసారి గెలిపించారు' అంటూ కేటీఆర్ ట్వీట్ చేయగా ఊహించని స్పందన లభిస్తోంది. బీజేపీ గెలవడంలో రాహుల్ గాంధీ సహకారం ఉందని కేటీఆర్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా రాహుల్ గాంధీ పని చేస్తున్నారని కొన్నాళ్లుగా కేటీఆర్ విమర్శిస్తున్నారు.
Also Read: Anirudh Reddy: తిరుగుబాటు ఎమ్మెల్యే సంచలనం.. 'బిర్యానీ, మటన్ కర్రీ తిని వచ్చాం.. అంతే!'
ఇక తెలంగాణ భవన్‌లో జరిగిన ఓ సమావేశంలో ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్లితే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని తెలిపారు. మహారాష్ట్రలో, ఢిల్లీలో రేవంత్ రెడ్డి ప్రచారం చేయగా కాంగ్రెస్ పార్టీ ఓడిందని గుర్తు చేశారు. ఢిల్లీలో ఇప్పుడు కాంగ్రెస్‌కు గుండు సున్నా మిగిలిందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఐరన్ లెగ్ అని అభివర్ణించారు.
Congrats to Rahul Gandhi for winning the election for BJP, yet again!
Well done 👏 https://t.co/79Xbdm7ktw
— KTR (@KTRBRS) February 8, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter