Group 1 Mains: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఆ వ్యవహారంపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం.. కానీ దానిని ధర్మాసనం తిరస్కరించలేదని చెప్పారు. కానీ సుప్రీంకోర్టు పరీక్షలు నిర్వహించినా సరే కానీ ఫలితాలు మాత్రం వెల్లడించవద్దని పేర్కొన్నదని కేటీఆర్ వివరించారు. హైకోర్టులో అభ్యర్థుల తరఫున తాము పోరాడుతామని ప్రకటించారు.
Also Read: Power Bill Hike: దీపావళికి రేవంత్ రెడ్డి విద్యుత్ ఛార్జీల భారం మోపితే చూస్తూ కూర్చోలేం: కేటీఆర్
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ పిటిషన్ సుప్రీంకోర్టు నిరాకరించిన వేళ తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఈఆర్సీ విషయాలు మాట్లాడిన అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. 'సుప్రీంకోర్టులో మేం వేసిన పిటీషన్‌ను తిరస్కరించలేదు. జీవో 29 ద్వారా నష్టం జరుగుతుందని మేము ముందే చెప్పాం' అని వివరించారు.
Also Read: Harish Rao: పెళ్లి కాని మగపిల్లలకు రూ.5 లక్షలు ఇచ్చాం.. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఇవ్వాలి
'ప్రశాంతంగా జరగాల్సిన గ్రూప్ 1 పరీక్షలు గందరగోళంలో జరుగుతున్నాయి. 95 శాతం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని నాటి సీఎం కేసీఆర్ ఉత్తర్వులు తీసుకువచ్చారు. ఆ జీవోతో
55 బలహీన వర్గాలకు అనుకూలంగా ఉంది' అని ఎమ్మెల్యే కేటీఆర్ వెల్లడించారు. జీవో 29పై హైకోర్టులో కూడా వాదనలు వినిపిస్తామని చెప్పారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వెళ్లి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి సిగ్గుంటే రాహుల్ గాంధీతో అశోక్ నగర్‌కు వెళ్లాలని సవాల్ విసిరారు.
'మూసీ నదిని పురిటిలోనే దామగుండంలో రేవంత్ రెడ్డి చంపే ప్రయత్నం చేస్తున్నారు. బండి సంజయ్‌కి రేవంత్ రెడ్డి రహస్య మిత్రుడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై రైడ్ జరిగితే ఇప్పటి వరకు ఈడీ నోట్ ఇవ్వలేదు' అంటూ పలు అంశాలపై కేటీఆర్ విమర్శలు చేశారు. ముత్యాలమ్మ ఆలయ సంఘటనపై స్పందిస్తూ 'బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఒక్క సంఘటన జరగలేదు. కాంగ్రెస్ వచ్చాక ఘటనలు జరుగుతున్నాయి' అని గుర్తుచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.