సినీ రచయిత పరుచూరి గోపాలక్రిష్ణ, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. బుధవారం జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో భాగంగా కేటీఆర్ " మహిళా సాధికారత, వర్క్ ఫోర్స్‌లో మహిళల సంఖ్య పెరుగుదల"అనే అంశంపై జరిగిన చర్చకు సమన్వయకర్తగా వ్యవహరించారు. తన వాక్చాతుర్యంతో చర్చలో పాల్గొన్న ఇవాంకా ట్రంప్ తో పాటు ప్రేక్షకులందరి మనసులను దోచుకున్నారు. ఇదే విషయంపై స్పందించిన పరుచూరి, ట్విటర్ వేదికగా కేటీఆర్‌ను ప్రశంసించారు.
"‘కేటీఆర్ గారూ.. ఇన్నాళ్లూ రాజకీయ పోరాట యోధునిగా, యువ నాయకునిగా తెలిసిన మీరు.. నిన్నని ప్రపంచ వ్యాపార సదస్సులో విశ్వవిజ్ఞానకనిలా కనిపించారు. అభినందనలండీ. మీ భాషణం అనితర సాధ్యం" అని ట్వీట్ చేశారు పరుచూరి. బుధవారం ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో భాగంగా జరిగిన ఈ చర్చా కార్యక్రమంలో ఇవాంకా ట్రంప్‌తో పాటు, డెల్ సీఈఓ కరేన్ క్వింటో, బ్రిటన్ మాజీ ప్రధాని టోని బ్లెయిర్ సతీమణి చెర్రీ బ్లెయిర్‌తో పాటు ఐసిఐసిఐ బ్యాంకు సీఈఓ చందా కొచ్చర్ పాల్గొన్నారు.
@KTRTRS గారు, ఇన్నాళ్లూ రాజకీయ పోరాట యోధునిగా, యువ నాయకునిగా తెలిసిన మీరు, నిన్న #GES2017 ప్రపంచ వ్యాపారసదస్సులో విశ్వవిజ్ఞానఖనిలా కనిపించారు! అభినందనలండి! మీ భాషణం అనితరసాధ్యం👍 pic.twitter.com/8D7SlNgkLk
— Paruchuri GK (@GkParuchuri) November 30, 2017