KTR on Budget: కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిందని విమర్శించారు. తెలంగాణ అసలు దేశంలో భాగమే కాదన్నట్లుగా నరేంద్ర మోదీ సర్కార్ వ్యవహరించిందని... రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులన్నింటినీ బుట్ట దాఖలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్లో పేదలకు పనికొచ్చేది ఒక్కటంటే ఒక్కటి కూడా లేదన్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అభివృద్ది, సంక్షేమంలో పురోగమిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి అండగా నిలబడమని కోరితే కేంద్రం పట్టించుకోలేదన్నారు కేటీఆర్. దేశంలో భౌగోళికంగా 11వ పెద్ద రాష్ట్రం, జనాభాపరంగా 12వ పెద్ద రాష్ట్రమైన తెలంగాణ.. దేశానికి తిండి పెట్టే రాష్ట్రాల్లో 4వ స్థానంలో ఉందన్నారు. ఈ మాట తాము చెబుతున్నది కాదని.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతోందని పేర్కొన్నారు. అలాంటి తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకుండా మరోసారి మొండి చెయ్యి చూపిందని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా అంశాన్ని విస్మరించిందన్నారు.
కేంద్రం ఇవ్వనంత మాత్రాన రాష్ట్రంలో ఆగేదేమీ లేదని.. ప్రజలందరి ఆశీర్వాదంతో కేసీఆర్ ప్రభుత్వం ఇలాగే ముందుకు దూసుకుపోతుందని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ.7వేల కోట్ల పైచిలుకు నిధులతో ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మార్చబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 26వేల స్కూళ్లలో మంచి క్లాస్ రూమ్స్, డైనింగ్ హాల్స్, స్టాఫ్ రూమ్స్, క్రీడా ప్రాంగణాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. అభివృద్ది పనుల్లో పేదలు ఉండే ప్రాంతాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం టాప్ ప్రియారిటీ ఇస్తుందన్నారు.
అంతకుముందు, జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని చిన్నాపురం చెరువు సుందరీకరణ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. స్థానికంగా రోడ్ల విస్తరణ పనులతో పాటు జలమండలి చేపట్టిన ఓఆర్ఆర్ రెండో దశ పనులకు శంకుస్థాపన చేశారు.
కాగా, కేంద్ర బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR on Budget) తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇది దిక్కుమాలిన బడ్జెట్ (Union Budget 2022) అని... అంతా గోల్మాల్ గోవిందమని కేసీఆర్ విమర్శించారు. దేశంలో ప్రబల పరివర్తన రావాల్సిన అవసరం ఉందని.. అందుకు తన వంత పాత్ర తప్పక పోషిస్తానని చెప్పారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం.. మత చిచ్చులు పెట్టడం తప్ప బీజేపీకి మరొకటి తెలియదన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ పతనానికి యూపీ ఎన్నికలే నాంది అన్నారు.
Also Read: Radhe Shyam Release Date: మార్చి 11వ తేదీన రాధేశ్యామ్ రిలీజ్.. ఓటీటీపై క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్
Also Read: అటకెక్కలేదు.. లైగర్ తర్వాత ఆ సినిమానే, విజయ్ నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి