Ktr Brother In Law Farm House Rave Party Latest Live Updates: తెలంగాణలో మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరిగిందనే వార్త ఒక్కసారిగా సంచలనం రేపింది. హైదరాబాద్ శివారులోని జన్వాడ గ్రామ పరిధిలో కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల ఫామ్ హౌస్‌లో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున ఓ పార్టీ జరిగిందని సమాచారం. భారీ డీజే శబ్దాలతో ఫామ్ హౌస్‌లో రచ్చరచ్చ రేపుతున్నారనే సమాచారం తెలుసుకున్న సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేయగా రేవ్ పార్టీ వెలుగులోకి వచ్చింది. ఈ పార్టీలో 21 మంది పురుషులు, 14 యువతులు పాల్గొన్నట్లు సమాచారం.
ఈ పార్టీలో భారీగా మాదక ద్రవ్యాలు వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా కొందరికి పరీక్షలు చేయగా ఓ వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. డ్రగ్ నిర్ధారణ కావడంతో ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు ఈఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడుల్లో భారీగా విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారు? ఎవరి ప్రమేయం ఉంది అనే వివరాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటి వరకు ఈ పార్టీపై కేటీఆర్ కానీ, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కానీ స్పందించలేదు.
కాగా ఈ పార్టీ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేటీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ మాదక ద్రవ్యాలకు అడ్డాగా హైదరాబాద్‌ను చేశారని ఆరోపిస్తున్నారు. కేటీఆర్‌ను కూడా విచారించాలని కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, రఘునందన్ రావు తదితరులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం మరింత ముదిరేటట్టు కనిపిస్తోంది.
కఠినంగా శిక్షిస్తాం
రేవ్ పార్టీ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ ఎంపీ అనిల్ యాదవ్ స్పందించారు. 'కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల సొంత ఫామ్ హౌస్‌లో డ్రగ్, విదేశీ మద్యంతో పార్టీ ఇచ్చారు. ఇది రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాను ప్రోత్సహించేలా ఉంది' అని తెలిపారు. డ్రగ్స్ పార్టీలో ఎంత పెద్ద వారు ఉన్నా వదిలిపెట్టమని.. కఠినంగా శిక్షించాల్సిందే అని స్పష్టం చేశారు.
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.