ఆకలితో అలమటిస్తున్న హైదరాబాద్ ( Hyderabad) వాసులకు ఆపన్న హస్తం అందించి వారి పొట్ట నింపుతున్నాడు ఒక ఎంబీయే గ్రాడ్యుయేట్. పేదవారి ఆకలి తీర్చడానికి రైస్ ఏటీఎం ప్రారంభించాడు. కరోనావైరస్ ( Coronavirus ) వల్ల దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించినప్పుడు చాలా మంది పొట్టనింపుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది. చేతిలో డబ్బు లేకపోవడం వల్ల తిండిగింజలకు అల్లాడిపోయారు చాలా మంది. అది గమనించిన రాము దోసపాటి ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం ప్రారంభించాడు. మార్చి నుంచి ఇలా తనకు తోచినంతగా 12,000 మందికి హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో రైస్ ఏటీఎం ( Rice ATM ) ద్వారా బియ్యం అందించగలిగాడు.
ALSO READ| IPL 2020: ఐపీఎల్ లో ఎక్కువ సార్లు టీమ్స్ మార్చిన ప్లేయర్స్ వీరే
"ఏ మనిషీ ఆకలితో నిద్రపోరాదు అనేది నేను నమ్ముతాను. అందుకే నేను ఇలా కొత్త కార్యక్రమం ప్రారంభించాను. ఎవరైనా వచ్చి అక్కడ ఉన్న బియ్యం తీసుకోవచ్చు " అని తెలిపాడు రాము.
కోవిడ్-19 (Covid-19 ) వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఈ రైస్ ఏటీఎం వరంగా మారింది. చాలా మంది ఈ సమయంలో ఉద్యోగాలు కోల్పోయారు. అనేక మంది జీతంలో కోత పడింది. చాలా మంది దగ్గర డబ్బు లేకుందా పోయింది అన్నారు రాము దోసపాటి.
రైస్ ఏటీఎంయ నడపాడానికి మార్చి నుంచి ఇప్పటి వరకు రాము దోసపాటి సుమారు రూ.4 లక్షలు ఖర్చు చేశాడు. ఇందులో అధికభాగం బియ్యం కొనుగోలుకే అయింది. రాము చేస్తున్న మంచి పనిని చూసి చాలా మంది ఈ మంచి కార్యక్రమంలో స్వచ్ఛందంగా చేరి తోచిన విధంగా సాయం చేస్తున్నారు.
ALSO READ| Gold Monetisation Scheme: లాకర్ లో ఉన్న మీ బంగారంతో డబ్బు సంపాదించండి
2006లో ఒక ప్రమాదం తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తరుణంలో తను కోలుకుంటే సామాజిక సేవ చేస్తాను అని దేవుడికి మొక్కుకున్నాడు. దేవుడి దయ వల్ల ప్రాణాలతో బయట పడ్డాను అని అందుకే ఇప్పుడు తన వంతుగా సేవ చేస్తున్నా అని తెలిపాడు.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR