Drug Test Challenge: మాజీ మంత్రి కేటీఆర్ బావ మరిది ఇంట్లో చేసుకున్న దావత్‌పై ఇంకా రాజకీయంగా తీవ్ర వివాదం కొనసాగుతోంది. ఆ వివాదం కాస్త బీఆర్‌ఎస్ పార్టీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర వివాదం మొదలైంది. డ్రగ్స్ వ్యవహారం మధ్యలోకి వచ్చింది. డ్రగ్స్ టెస్టుకు సిద్ధమా? అంటూ పరస్పరం ఆ పార్టీ నాయకుల మధ్య సవాళ్లు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కేటీఆర్‌తో సహా తమ 28 మంది ఎమ్మెల్యేలు డ్రగ్స్ టెస్టుకు సిద్ధమని ప్రకటించారు. ఈ సందర్భంగా డబ్బాలు పట్టుకుని చూపించారు. రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా డ్రగ్స్ టెస్టుకు రావాలని ఎమ్మెల్యే కౌశిక్ సవాల్ విసిరారు.
Also Read: Survey: తెలంగాణ సర్కార్ సంచలనం.. మళ్లీ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే
డ్రగ్స్ టెస్టు పేరిట కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్, బల్మూర్ వెంకట్ చేసిన హంగామాపై కౌశిక్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ మాట్లాడారు. 'బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పరీక్షలు చేయించుకోవడం కోసం సిద్ధంగా ఉన్నారా అని అనిల్ ప్రశ్నిస్తే మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పాం. మమ్మల్ని ఎక్కడకి రమ్మని చెప్పకుండా అయన ఆసుపత్రికి పోయి ఫొటోలు, వీడియోలు తీసుకోవడం వింతగా ఉంది' అని తెలిపారు.
Also Read: Revanth Reddy: మొదట కేసీఆర్.. తర్వాత కేటీఆర్.. చివరకు హరీశ్ రావును ఫినిష్ చేస్తా
'మా పంచాయితీ మీతో కాదు రేవంత్ రెడ్డితోనే. నన్ను డ్రగ్స్ వ్యవహారంలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాదని ప్రెస్‌మీట్ పెట్టి ఐజీని చెప్పమనండి' అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. 'నా మీద ఎలాంటి ప్రయత్నం చేశారో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పైన అలాంటి ప్రయత్నమే చేశారు' అని ఎలిపారు. 'రేవంత్ రెడ్డికి దమ్ముంటే మీ ఎమ్మెల్యే లు, ఎంపీలు డ్రగ్స్ టెస్ట్‌కు ఎందుకు వస్తలేరు' అని నిలదీశారు.
'ఆరు గ్యారంటీలు విషయాన్ని అడిగితే డైవర్ట్ చేస్తారు. రైతులకు వంద శాతం రుణమాఫీ చేయలేదు. రైతులకు బోనస్ ఇచ్చి పంట కొనాల్సి ఉండగా కనీసం ఒక్క గింజ కొన్నారా? అన్యాయంగా ఇరికించి బద్నామ్ చేయాలనీ చూస్తే ఇక్కడ ఊరుకోనేది ఎవరు లేరు' అని కౌశిక్ రెడ్డి తెలిపారు.
బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పందించారు. 'కేసీఆర్ లేకుండా మీ మీటింగ్ ఉందా? కేసీఆర్ చరిత్ర లేకుండా చేస్తాడనని చెప్పిన రేవంత్ రెడ్డి మాటలు విని నవ్వాలా ఏడవాలా అర్ధం కావడం లేదు' అని ఎద్దేవా చేశారు. 'కేసీఆర్ ప్రజల గుండెల్లో నిత్యం ఉంటాడు. ప్రజలు నీకు మంచి అవకాశం ఇస్తే రేవంత్ రెడ్డి వచ్చిన పదినెలలు ప్రజలు చీ చీ తూ తూ అంటున్నారు. దేశంలో రేవంత్ రెడ్డి లాంటి తుగ్లక్ ముఖ్యమంత్రి ఎవరూ లేరు' అని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.