Mohan babu and manoj controversy: మోహన్ బాబు, మంచు మనోజ్ ఫ్యామిలీ వివాదం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అదే విధంగా దీనిపై మంచు మనోజ్ మోహన్ బాబు నివాసమైన జల్ పల్లి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంతే కాకుండా.. మంచు మనోజ్ దీనిపై జల్ పల్లిలో తన ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
అప్పుడు.. కొంత మంది మీడీయావాళ్లు అక్కడికి వచ్చిన మోహన్ బాబు దగ్గరకు వచ్చి ఆయనను ఘటనపై ప్రశ్నించినట్లు తెలుస్తొంది. దీంతో మోహన్ బాబు.. ఒక్కసారిగా అక్కడి మీడియావారిపై మైక్ పట్టుకుని దాడి చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసుల్ని సైతం నమోదు చేశారు. ఇప్పటికే దీనిపై ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో కీలక వాదనలు నడిచినట్లు తెలుస్తోంది.
అయితే.. సోమవారం వరకు అరెస్ట్ చేయోద్దని మోహన్ బాబు తరపు లాయర్ లు తెలంగాణ హైకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ ను దాఖలు చేసినట్లు సమాచారం. కానీ కోర్టు మాత్రం.. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తొంది. అదే విధంగా.. తదుపరి విచారణకు తెలంగాణ హైకోర్టు సోమవారంకు వాయిదా వేసినట్లు సమాచారం.
మోహన్ బాబు చేతిలో గాయపడిన వ్యక్తి ప్రస్తుతం ఇంకా ఆస్పత్రిలో ఉన్నట్లు తెలుస్తొంది. ఆయనను ఇటీవల మోహన్ బాబు పరామర్శించి.. సారీ కూడా చెప్పారు. అదే విధంగా మీడియాకు కూడా మోహన్ బాబు సారీ చెప్పిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter