Mohan Babu: మోహన్ బాబుకు బిగ్ షాక్.. ముందస్తు బెయిల్‌పై షాకింగ్ తీర్పు వెలువరించిన హైకోర్టు..

Mohan babu family dispute: మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైనట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయనకు తెలంగాణ హైకోర్టు బెయిల్ పిటిషన్ ను రద్దు చేసినట్లు సమాచారం.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 23, 2024, 03:52 PM IST
  • మోహన్ బాబుకు మరో ట్విస్ట్..
  • హైకోర్టులో వాడీ వేడీగా వాదనలు..
Mohan Babu: మోహన్ బాబుకు బిగ్ షాక్.. ముందస్తు బెయిల్‌పై షాకింగ్ తీర్పు వెలువరించిన హైకోర్టు..

Mohan babu bail petition update: నటుడు మోహన్ బాబుకు వరుస షాకింగ్ ఘటనలు ఎదురౌతున్నాయని చెప్పుకొవచ్చు. ఒక వైపు కొడుకు మంచు మనోజ్ తో.. ఫ్యామిలీ గొడవలు పీక్స్ కు వెళ్లిన విషయం తెలిసిందే. ఇది చాలదన్నట్లు ఆయన జల్ పల్లి వద్ద కంట్రోల్ తప్పి ఒక మీడియా ప్రతినిధిపై మైక్ తీసుకుని దాడికి పాల్పడ్డారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. రక్త స్రావం కూడా అయ్యింది. అదే విధంగా  ఈ ఘటనపై పోలీసులు సైతం సీరియస్ అయ్యారు.

నటుడు మోహన్ బాబుపై హత్యా ప్రయత్నం కింద కేసును నమోదు చేశారు. అయితే మోహన్ బాబు ప్రస్తుతం కొన్నిరోజులుగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలుస్తొంది.ఈ క్రమంలో ఆయనకు గతంలో తెలంగాణ హైకోర్టు.. పోలీసులు ఎదుట హజరు కాకుండా.. రిలాక్సెషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు తరపు లాయర్ లు మాత్రం.. తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పై  పిటిషన్ ను దాఖలు చేసినట్లు తెలుస్తొంది.

దీనిపై గతంలో వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం మాత్రం.. తీర్పును వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో మరల వాదనలు జరిగినట్లు తెలుస్తొంది. మోహన్ బాబు తరపు లాయర్ తన వాదనలు విన్పిస్తు.. నటుడు మోహన్ బాబు.. మనవడి కోసం దుబాయ్ కు వెళ్లారని.. కొన్నిరోజులుగా ఆయన ఆరోగ్యం బాగాలేదని, ప్రస్తుతం తిరుపతిలో ఉన్నారని చెప్పినట్లు తెలుస్తొంది. దీంతో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం.. బెయిల్ ఇవ్వొద్దని కూడా వాదనలు గట్టిగానే విన్పించినట్లు సమాచారం .

Read more: Mohan babu Family Dispute: జల్ పల్లిలో సౌందర్య ఆత్మ..?.. మోహన్ బాబు ఇంట్లో గొడవలకు అదే కారణామా..?.. భయపడిపోతున్న స్థానికులు..

 ఈ నేపథ్యంలో ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. మోహన్ బాబుకు అప్లై చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసినట్లు తెలుస్తోంది.  మరోవైపు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ను రద్దు చేసిన నేపథ్యంలో మోహన్ బాబును పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తొంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News