TS School Holiday: తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు కీలక ప్రకటన చేసింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు ఫిబ్రవరి 8న సెలవుదినంగా ప్రకటించింది. దీనికి కారణం ఏంటని విద్యార్థులు గమనించాల్సిన విషయం.
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు కీలక ప్రకటన చేసింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, స్కూళ్లు ఆఫీసులకు ఫిబ్రవరి 8న సెలవుదినంగా ప్రకటించింది. దీనికి కారణం ఏంటని విద్యార్థులు గమనించాల్సిన విషయం. తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 8న సెలవుదినంగా అధికారికంగా ప్రకటించింది. ఈరోజు షబ్ ఇ మెరాజ్ సందర్భంగా ఈ నిర్ణయం తీసకున్నట్లు గురువారం తెలిపింది.. అంటే రానున్న గురువారం ఫిబ్రవరి 8న సాధారణ సెలవు దినం.
తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 8న షబ్ ఏ మెరాజ్ ను ఆప్షనల్ హాలిడేగా సెలవుల జాబితాలో చేర్చింది. ప్రస్తుతం దాన్ని జనరల్ హాలిడేగా ప్రకటించింది. ఈరోజు ముస్లింలు రాత్రంతా జాగారం చేస్తారు. పర్వానా మసీదులను లైట్లతో అలంకరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ వేడుకను జరుపుకుంటారు. ఇది ముస్లిములకు పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు, ఆఫీసులు బంద్ ఉంటాయి.
ఈ నెలలో కేవలం బ్యాంకులకు మాత్రమే భారీగా సెలవులు ఉన్నాయి. ఈ సంవత్సరం లీప్ ఇయర్ కాగా బ్యాంకులు ఈ నెలలో కేవలం 18 రోజులపాటు మాత్రమే పనిచేయనున్నాయి. అందుకే బ్యాంకు పని ఉన్నవారు తప్పకుండా ఈ సెలవు గురించి తెలుసుకుని ఉండాలి.
ఏపీలో కూడా షబ్ ఇ మెరాజ్ సందర్బంగా సెలవు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ నిర్ణయం అధికారికంగా ప్రకటించలేదు.. ఈ సెలవకు తర్వాత మళ్లీ వచ్చే నెల అంటే మార్చి వరకు ఎలాంటి ప్రభుత్వ సాధారణ సెలవు దినాలు లేవు. కానీ, తెలంగాణ సర్కార్ ఫిబ్రవరి 8న సెలవు రోజుగా ఆదేశాలు జారీ చేయడంతో అధికారికంగా ఈరోజు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవు లభించింది. అంతేకాదు ఈరోజు ఏ ప్రభుత్వ కార్యాలయాలు కూడా పనిచేయవు.
ఇదీ చదవండి: Kumari Aunty Food Point: కుమారి ఆంటీకి సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. నెట్టిజన్ల ప్రశంసలు..
ఇదీ చదవండి: EPFO Balance Check: UAN నంబర్ తో సంబంధం లేకుండా ఇలా సింపుల్ గా పీఎఫ్ బ్యాలన్స్ చెక్ చేసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook