School Teacher: విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్‌.. దేహశుద్ధి చేసిన పేరెంట్స్!!

Parents hitting school Teacher. కన్న బిడ్డ లాంటి విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఓ ట్యూషన్ టీచర్‌ను పేరెంట్స్ దేహశుద్ధి చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరులో చోటుచేసుకుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 8, 2022, 09:11 AM IST
  • విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్‌
  • దేహశుద్ధి చేసిన పేరెంట్స్
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
School Teacher: విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్‌.. దేహశుద్ధి చేసిన పేరెంట్స్!!

Parents hitting school Teacher Salman Raju in Patancheruvu: విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి ఉత్తమ మార్గంలో నడిపించాల్సిన ఓ ఉపాధ్యాయుడు దుర్మార్గంగా వ్యవహరించాడు. తండ్రి స్థానంలో ఉండి విద్యార్థులను అభివృద్ధి పథంలో నడిపించాల్సిన గురువు.. కామంతో కళ్లు మూసుకుపోయి కన్న బిడ్డ లాంటి విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న వారి పేరెంట్స్‌.. సదరు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరులో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే... 

ముత్తంగి పరిధిలోని సాయి ప్రియ కాలనీలో స్థానికంగా నివసిస్తున్న భట్టు సాల్మన్ రాజు (52) అనే వ్యక్తి ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. అంతేకాకుండా ఇంటివద్ద కాలనీలోని విద్యార్థులకు ట్యూషన్ కూడా చెబుతున్నాడు. తన వద్దకు వచ్చే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన సల్మాన్ రాజు.. బాలికలతో అనుచితంగా ప్రవర్తిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కూడా సాల్మన్ రాజు బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు. 

సదరు బాలికలు ఈ విషయంను తమ తల్లిదండ్రులకు చెప్పారు. ఆగ్రహంతో ఊగిపోయిన పేరెంట్స్.. సల్మాన్ రాజు ఇంటివద్దకు వచ్చి గొడవ చేశారు. ఆపై అతడికి దేహశుద్ధి చేశారు. చొక్కా విప్పిమరీ రోడ్డుపై పడేసి కొట్టారు. మహిళలలు అయితే చెప్పుతో కొట్టారు. అక్కడితో ఆగకుండా గొంతుపై కాలు పెట్టి తొక్కుతూ తమ కసి తీర్చుకునారు. చావురా, చావురా అంటూ వారు ఊగిపోయారు. 

ఈఘటనలో సాల్మన్ రాజుకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన అతడిని స్థానికులు పటాన్ చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వైద్యం నిమిత్తం తరలించారు. ఉపాధ్యాయుడు తీరుపట్ల పలువురు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ విషయంపై సాల్మన్ రాజు స్టేట్మెంట్ కూడా వారు తీసుకున్నారు. 

Also Read: UP Exit Poll Results 2022: ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ బీజేపీదే హవా.. కానీ.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏం చెబుతున్నాయంటే

Also Read: Horoscope Today March 8 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశి వారు కష్టాలను కొని తెచ్చుకుంటారు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News