తహసీల్దార్ హత్య కేసులో పోలీసుల చేతికి కీలక సాక్ష్యాలు ?

తహసీల్దార్ హత్య కేసులో పోలీసుల చేతికి కీలక సాక్ష్యాలు ?

Last Updated : Nov 6, 2019, 02:45 PM IST
తహసీల్దార్ హత్య కేసులో పోలీసుల చేతికి కీలక సాక్ష్యాలు ?

హైదరాబాద్: తహసీల్దార్‌ విజయా రెడ్డి హత్య కేసులో పోలీసులు కీలక సాక్ష్యాలు సేకరించినట్టు తెలుస్తోంది. నిందితుడు కూర సురేష్‌ వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు.. విచారణలో అతడు వెల్లడించిన వివరాల ఆధారంగా పలు సాక్ష్యాలను సేకరించినట్టు సమాచారం. సురేష్‌ కాల్‌డేటాను విశ్లేషించగా అతడు దాడి చేయడానికి ముందుగా ఓ రియల్టర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్టు తేలింది. దీంతో సురేష్ ఈ హత్య చేయడం వెనుక ఎవరైనా రియల్టర్ల హస్తం ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. సురేష్‌ ఫోన్‌లో రికార్డ్‌ అయిన వాయిస్‌ కాల్స్ డేటా సైతం ప్రస్తుతం పోలీసులు చేతుల్లోనే ఉంది. వీటన్నింటినీ పరిశీలించిన పోలీసులు.. సురేష్ పక్కాగా రెక్కి నిర్వహించిన తర్వాతే ఒక పథకం ప్రకారం తహశీల్దార్‌పై దాడికి పాల్పడినట్టు ఓ ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 
  
సంచలనం సృష్టించిన తహసీల్దార్ విజయా రెడ్డి హత్య కేసుని ఛేదించేందుకు ఏసీపీ జయరాం ఆధ్వర్యంలో నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుడి వెనుకున్నది ఎవరైనా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇప్పటికే రాచకొండ సీపీ మహేష్ భగవత్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Trending News