Hyderabad Metro: ఫ్యూచర్ సిటీ, శామీర్‌పేట్, మేడ్చల్ మెట్రో మార్గాలకు సంబంధించిన సమగ్ర వివరణాత్మక ప్రణాళికలు (డీపీఆర్‌లు) మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూడు మెట్రోల డీపీఆర్‌లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొంది ఏప్రిల్ నెలాఖరుకు టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్‌లో మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్ల నిర్మాణాలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలపై హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష చేపట్టారు.
Also Read: BRS Party: 'ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ మల్లెపువ్వు లాగా బయటకు వస్తాడు'
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం-ఫ్యూచర్ సిటీ మెట్రో (40 కి.మీ.), జేబీఎస్-శామీర్‌పేట మెట్రో (22 కి.మీ), ప్యారడైజ్-మేడ్చల్ మెట్రో (23 కి.మీ.) మార్గాలకు సంబంధించి భూ సేకరణను వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎలివేటెడ్ కారిడార్ల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారు. ఎలైన్‌మెంట్ రూపొందించేటప్పుడే క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేయాలని పేర్కొన్నారు. మేడ్చల్ మార్గంలో జాతీయ రహదారి మార్గంలో ఇప్పటికే ఉన్న మూడు ఫ్లైఓవర్లను దృష్టిలో ఉంచుకొని మెట్రో లైన్ తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
Also Read: KT Rama Rao: నాకు ఉరిశిక్ష పడ్డట్టు కాంగ్రెసోళ్ల సంబరాలు ఎందుకు? నేను అవినీతి చేయలేదు
శామీర్‌పేట్, మేడ్చల్ మెట్రోలు ఒకే చోట ప్రారంభమయ్యేలా చూసుకోవాలని రేవంత్ రెడ్డి చెప్పారు. అధునాతన వసతులు.. భవిష్యత్ అవసరాలకు తగినట్లు భారీ జంక్షన్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఆయా ప్రాంతాల వారు ప్రతి పనికి హైదరాబాద్‌లోకి రానవసరం లేకుండా అక్కడే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఆ జంక్షన్‌ను అభివృద్ధి చేయాలని చెప్పారు. జంక్షన్‌కు సంబంధించిన పూర్తి ప్రణాళికను తయారు చేయాలని ఆదేశించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.