Christmas Holidays: విద్యార్థులకు పండుగలాంటి వార్త ఇది. వరుసగా మూడు రోజుల పాటు సెలవులు వచ్చాయి. రేపటి నుంచి మూడు రోజులు విద్యాలయాలకు సెలవులు ఉండనున్నాయి. దీంతో క్రిస్మస్ పండుగ విద్యార్థులు జోరుగా చేసుకోవచ్చు. పిల్లలకు వరుస సెలవులు కావడంతో తల్లిదండ్రులు, వారి కుటుంబసభ్యులు భారీ టూర్‌కు వెళ్లవచ్చు. చాలా రోజుల తర్వాత భారీగా సెలవులు రావడంతో పిల్లలు కుటుంబంతో హాయిగా గడపవచ్చు.
Also Read: Snakes Attack Video: పాముల దండయాత్ర.. చిక్కినట్టే చిక్కి తుర్రుమన్న 'తొండ'
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలు ఆనందోత్సాహాలు.. భక్తిశ్రద్ధలతో చేసుకుంటారు. వారికి సంవత్సరంలో ఉండే ఒకే ఒక పండుగ క్రిస్మస్. వారి పండుల్లో అతి పెద్ద పండుగ క్రిస్మస్ కావడంతో ఆ వర్గం కోసం తెలంగాణ ప్రభుత్వం కొన్నేళ్ల కిందట సెలవులను పెంచిన విషయం తెలిసిందే. నాటి సీఎం కేసీఆర్ క్రైస్తవులకు పండుగ కానుకల (కొత్త బట్టలు)తోపాటు విద్యార్థులకు సెలవులను పెంచారు. క్రిస్మస్ ముందు రోజు.. తర్వాతి రోజు ఇలా మూడు రోజులు సెలవులు ఇచ్చారు.
Also Read: K Kavitha: 'రేవంత్ రెడ్డి' రివెంజ్, డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే 'అల్లు అర్జున్' వివాదం
అందులో భాగంగా రేపటి నుంచి వరుసగా క్రిస్మస్ సెలవులు మూడు రోజులు రానున్నాయి. క్రిస్మస్ ముందు రోజును ఈవ్ అంటారు. దీనికి ఆప్షనల్ హలీడే ఇచ్చారు. క్రిస్మస్ తర్వాతి రోజును బాక్సింగ్ డే అంటారు. క్రిస్మస్‌తోపాటు బాక్సింగ్ డేను పబ్లిక్ హలీడేలుగా ప్రకటించారు. ఈవ్, క్రిస్మస్, బాక్సింగ్ డేలకు కలిపి మూడు సెలవులు రావడం విశేషం. ఆదివారం తర్వాత ఒక రోజు సోమవారం వదిలేస్తే మంగళ, బుధ, గురువారాల్లో సెలవులు వచ్చాయి. కాగా కొంతమంది మూడు సెలవులను ముందే తెలుసుకుని సోమవారం కూడా సెలవు తీసుకుని ఆదివారంతో కలిపి వరుసగా ఐదు రోజులు సెలవులు ఎంజాయ్ చేశారు. పిల్లలను సోమవారం ఒక రోజు డుమ్మా కొట్టించి కుటుంబసభ్యులు కొందరు పర్యాటక ప్రాంతాలకు.. లేదా స్వగ్రామాలకు వెళ్లారు. కాగా ఒక్క పాఠశాలలే కాదు దాదాపుగా కళాశాలలకు కూడా ఈ సెలవులు ఉన్నాయి. కొన్ని ప్రత్యేక కళాశాలలకు మాత్రం ఒక్క క్రిస్మస్ రోజు మాత్రమే సెలవు ఉంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఈ క్రిస్మస్ పండుగ అందరి కుటుంబాల్లో సంతోషాలు వెదజల్లాలని జీ తెలుగు న్యూస్ కోరుతోంది. ఈ సందర్భంగా ప్రజలదరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.