Telangana Assembly Sessions: ముఖ్యంగా ఈ ఎన్నికల్లో విద్యా, ఉపాధి రంగాల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లులకు చట్టబద్ధత కల్పించాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీల రిజర్వేషన్లపై మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది. వాటిపై చర్చ జరిపి, ఆమోదించిన అనంతరం చట్టబద్ధత కల్పించనుంది.
ఈ నేపథ్యంలో మూడు బిల్లుల ముసాయిదాల రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. త్వరలోనే ప్రభుత్వానికి ముసాయిదాలు అందనున్నాయి. అవి అందిన వెంటనే రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై చర్చించనుంది. ఆ తర్వాత వాటిని ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేయనుంది. రాష్ట్రంలోని ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరించాలంటూ ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందించింది. మాల, మాదిగల్లోని ఉపకులాలన్నింటినీ మూడు గ్రూపులుగా విభజించింది. గ్రూపు-1లో సామాజికంగా, ఆర్థికంగా, విద్యా పరంగా అత్యంత వెనకబడిన, పట్టించుకోని కులాలను చేర్చి వారికి 1 శాతం రిజర్వేషన్ కల్పించింది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
గ్రూపు-2లో ఒక మోస్తరుగా లబ్ధి పొందిన కులాలను చేర్చి వారికి 9 శాతాన్ని ప్రతిపాదించింది. గ్రూపు-3లో మెరుగైన ప్రయోజనాలను పొందిన కులాలను చేర్చి వారికి 5 శాతాన్ని కేటాయించింది. మొత్తంగా కమిషన్ రాష్ట్రంలోని 59 కులాలకు 15 శాతం రిజర్వేషన్లను కేటాయించింది.
నివేదికను బిల్లు రూపంలోకి తీసుకొచ్చి, వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించింది. అలా చేస్తే రిజర్వేషన్ల అమలులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు, కమిషన్ గడువును తాజాగా పెంచడంతో వర్గీకరణలో ఏవైనా మార్పులు ఉంటాయా? అనే చర్చ కూడా జరుగుతోంది.
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.