Telangana Groups 2 3 Exams: తెలంగాణలో పోటీ పరీక్షలపై నిరుద్యోగులు పోరాటం చేస్తున్నారు. పరీక్షలు వాయిదా వేయాలని.. గ్రూప్స్ పరీక్షల పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గ్రూపు 2, గ్రూపు 3 పరీక్షల వాయిదా పడ్డాయని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. గ్రూప్స్ పరీక్షలు వాయిదా పడ్డాయని విస్తృతంగా ప్రచారం జరగడం కలకలం రేపింది. ఇది తప్పుడు ప్రచారం అని గుర్తించిన టీజీపీఎస్సీ వెంటనే అప్రమత్తమైంది. ఈ మేరకు గ్రూప్సు పరీక్షలపై కీలక ప్రకటన విడుదల చేసింది. పరీక్షలు వాయిదా వేయలేదని ప్రకటించారు.
Also Read: Group 1 Mains: ఉచితంగా గ్రూప్ 1 అధికారి కావొచ్చు.. తెలంగాణ నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్
గ్రూప్ 2, గ్రూప్ 3 వాయిదా అని జరుగుతున్న ప్రచారాన్ని టీజీపీఎస్సీ ఖండించింది. గ్రూప్ 2,గ్రూప్ 3 పరీక్షలు తేదీల మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించింది. పరీక్షలు వాయిదా పడ్డాయని జరుగుతున్న ప్రచారం మొత్తం తప్పని తెలిపింది. ఇదంతా తప్పుడు ప్రచారంగా పేర్కొంది. ఈ వార్తలను గ్రూప్స్ అభ్యర్థులు పట్టించుకోవద్దని సూచించింది. గ్రూప్సు పరీక్షలపై ఇప్పటికే టీజీపీఎస్సీ తేదీలు ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read: DSC Exams: డీఎస్సీ అభ్యర్థులకు భారీ షాక్.. పాలమూరులో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
గ్రూప్ 2 పరీక్షలు ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సి ఉన్నాయి. 783 పోస్టుల భర్తీపై గ్రూపు 2 ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఇక 1,388 గ్రూపు 3 ఉద్యోగాల భర్తీకి నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కాగా ప్రస్తుతం నిరుద్యోగులు పరీక్షలు వాయిదా వేయాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఇప్పటికే డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని నిరసనలు జరుగుతుండగా.. గ్రూప్ పరీక్షలు కూడా వాయిదా వేయాలనే డిమాండ్ మొదలైంది. ఈ క్రమంలోనే పరీక్షలు వాయిదా పడ్డాయనే వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా టీజీపీఎస్సీ ప్రకటించలేదు. వాయిదాలపై తప్పుడు ప్రచారం జరుగుతుండడాన్ని టీజీపీఎస్సీ అడ్డుకట్ట వేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter