KTR toured Station F: ఫ్రాన్స్‌లో కొనసాగుతోన్న కేటీఆర్‌ పర్యటన

KTR toured Station F: ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ క్యాంపస్ స్టేషన్ ఎఫ్‌ ని కేటీఆర్‌‌ తాజాగా సందర్శించారు. స్టేషన్‌ ఎఫ్ టీమ్ తో తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, టీ హబ్ వి హబ్, టీ వర్క్స్ గురించి వివరించారు. 

Last Updated : Oct 29, 2021, 09:43 AM IST
  • ఫ్రాన్స్‌ పర్యటనలో మంత్రి కేటీఆర్‌
  • ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ క్యాంపస్ స్టేషన్ ఎఫ్‌ ని సందర్శించిన కేటీఆర్‌‌
  • తెలంగాణలో పర్యటించాలని ఎంబీడీఏ ప్రతినిధి బృందాన్ని కోరిన కేటీఆర్
KTR toured Station F: ఫ్రాన్స్‌లో కొనసాగుతోన్న కేటీఆర్‌ పర్యటన

Telangana Minister KTR toured Station F, worlds largest incubator campus located in Paris: ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలోని రాష్ట్ర బృందం తాజాగా పలు కంపెనీల సీఈవోలు, అధిపతులతో సమావేశమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ క్యాంపస్ స్టేషన్ ఎఫ్‌ ని కేటీఆర్‌‌ (KTR) తాజాగా సందర్శించారు.

స్టేషన్‌ ఎఫ్ టీమ్ తో తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, (Telangana's innovation ecosystem organizations) టీ హబ్ (THub), వి హబ్, (WeHub) టీ వర్క్స్ (TWorks) గురించి వివరించారు. అంతకు ముందు మంత్రి కేటీఆర్ మిస్సైల్‌, మిస్సైల్‌ సిస్టమ్స్‌లో ప్రఖ్యాతిగాంచిన పారిస్‌కు చెందిన ఎంబీడీఏ కంపెనీ డైరెక్టర్లు బోరిస్‌ సోలోమియాక్‌, పాల్‌ నీల్‌ లే లివెక్‌, ఇతర ప్రతినిధులతో సమావేశమయ్యారు కేటీఆర్‌. వారికి తెలంగాణలో తయారీ రంగం అవకాశాలను వివరించారు. తెలంగాణలో ఉన్న అవకాశాలను తెలుసుకునేందుకు రాష్ట్రంలో పర్యటించాలని ఎంబీడీఏ ప్రతినిధి బృందాన్ని కోరారు.

ఏరో క్యాంపస్‌ ఆక్విటైన్‌ (Aerocampus Aquitaine) సంస్థ డైరెక్టర్‌ జేవియర్‌ ఆడియాన్, ఇతర ప్రతినిధులతోనూ కేటీఆర్ సమావేశమయ్యారు. ఫ్రాన్స్‌లోని భారత రాయబారి జావెద్‌ ఆష్రాఫ్‌తో (Javed Ashraf) సమావేశమైన కేటీఆర్‌.. వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఫ్రెంచ్‌ కంపెనీలు (French‌ companies) తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉన్న రంగాల గురించి తెలిపారు. 800 కంపెనీలతో కూడిన కాస్మోటిక్‌ వ్యాలీ క్లస్టర్‌ డిప్యూటీ సీఈవో ఫ్రాంకీ బెచెర్యూతో కేటీఆర్‌‌ (KTR) సమావేశమై భారతదేశ కాస్మోటిక్‌ మార్కెట్‌ గురించి వివరించారు. తెలంగాణలో కాస్మోటిక్స్‌ (Cosmetics‌) తయారీ అవకాశాలను వెల్లడించారు.

Also Read : Facebook: ఫేస్‌బుక్ కంపెనీ పేరు మారింది.. మెటా కిందకు వచ్చిన ఫేస్‌బుక్‌ యాప్స్

ఇక తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు కాస్మొటిక్‌ వ్యాలీ సంస్థలు ఆసక్తి చూపాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. భారత్‌లో సౌందర్య సాధనాలకు భారీగా డిమాండ్‌ ఉందని.. మార్కెటింగ్‌లో ఏటా భారీ వృద్ధి రేటు సాధిస్తోందని కేటీఆర్ చెప్పారు. వైమానిక, రక్షణ (Aviation, defense) రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ అత్యంత విశ్వసనీయ గమ్యస్థానంగా ఉందని, క్షిపణుల తయారీ పరిశ్రమలకు సిద్ధంగా ఉందని కేటీఆర్‌ చెప్పారు. పారిస్‌లోని ప్రసిద్ధ క్షిపణుల తయారీ సంస్థ ఎంబీడీఏ డైరెక్టర్లతో (MBDA Directors) కేటీఆర్‌‌ భేటీ అయ్యారు. ప్రపంచంలోని ప్రసిద్ధ వైమానిక సంస్థలు తెలంగాణలో పరిశ్రమలను స్థాపించి.. విమానాలు, హెలికాప్టర్ల విడిభాగాలను తయారు చేస్తున్నాయని వివరించారు. క్షిపణుల తయారీకి (Manufacture of missiles) సన్నద్ధమవుతున్నామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలని ఆ సంస్థ ప్రతినిధులను కేటీఆర్‌‌ (KTR) కోరారు.

Also Read : Corona Updates: ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కొవిడ్ భయాలు- రష్యా, చైనాలో కొత్త కేసుల కలవరం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News