Telangana Secretariat: తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కష్టపడి ఇష్టపడి కట్టించుకున్న తెలంగాణ సెక్రటేరియట్ ప్రమాదంలో పడింది. అవును తెలంగాణ సెక్రటేరియట్ సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ అంతస్తులో పెచ్చులు స్వల్పంగా ఊడిపడ్డాయి. ఐదో అంతస్తు నుంచి బయటకు వచ్చే మెయిన్ ఎంట్రన్స్ వద్ద పెచ్చులు ఊడిపడడంతో ప్రమాదం జరిగింది.
రామగుండం మార్కెట్ కమిటీ ఛైర్మన్ కారుపై ఒక్కసారిగా పెచ్చులు ఊడిపడ్డాయి. ప్రమాదంలో కారు డ్యామేజ్ అయనట్లు తెలుస్తోంది. కారులో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.1200 కోట్లతో సచివాలయాన్ని నాసిరకంగా నిర్మించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడే సచివాలయ నిర్మాణానికి భారీ ఖర్చుపై సీఎం రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
మొత్తంగా తెలంగాణ బడ్జెట్ సమావేశాలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కొత్త సచివాలయ నాసి రకం నిర్మాణంపై అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని ప్రభుత్వం నిలదీయనుంది. మరోవైపు బీజేపీ నేతలు కూడా ఇదే అంశంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ను దుమ్మెత్తిపోయనున్నాయి. మరోవైపు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశాన్ని ప్రస్తావించే అవకాశాలున్నాయి. వాటికి చెక్ పెట్టేలా రేవంత్ రెడ్డి సర్కారుకు ఇపుడు సచివాలయం అంశం మంచి ఆయుధంలా దొరికిందనే చెప్పాలి.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.