/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

KT Rama Rao HYDRAA: తెలంగాణలో హైడ్రా సృష్టించిన ప్రకంపనలతో రాష్ట్ర ఆదాయం ఊహించని స్థాయిలో తగ్గిపోయి ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలవడంతో రాష్ట్రం అథఃపాతాళానికి వెళ్తోంది. రెండు నెలలుగా రాష్ట్ర ఆదాయం తగ్గిపోతుండడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లు అభివృద్ధి పథంలో నడిచిన రాష్ట్రం ఇప్పుడు తిరోగమనం పట్టడంతో కేటీఆర్‌ రేవంత్‌ రెడ్డిని నిలదీశారు. 'తెలంగాణను ఏం చేద్దాం అనుకుంటున్నావ్‌ స్వామి?' అంటూ కేటీఆర్‌ ప్రశ్నించారు.

Also Read: BRS Party: కేసీఆర్‌, కేటీఆర్‌కు భారీ షాక్‌.. సీఎం చంద్రబాబుతో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేల భేటీ

హైడ్రా కూల్చివేతలతో రిజిస్ట్రేషన్‌ తగ్గడంపై కేటీఆర్‌ 'ఎక్స్‌' వేదికగా స్పందించారు. 'ప‌నిమంతుడని పందిరేపిస్తే పిల్లి తోక త‌గిలి కూలింద‌ట‌. గ‌ట్ల‌నే ఉంది చీప్ మినిస్ట‌ర్ రేవంత్ రెడ్డి తీరు. తెలంగాణ‌కు గుండెకాయ వంటి హైద‌రాబాద్‌ను కాపాడుకోవ‌టం చేత‌కాక‌.. సామాన్యుల‌పైకి బుల్డోజ‌ర్స్ పంపి భ‌యాన్ని సృష్టించాడు. తీరా చూస్తే.. రాష్ట్రానికి వ‌చ్చే ఆదాయం ప‌డిపోయింది' అని కేటీఆర్‌ తెలిపారు.

Also Read: Deputy CM Theft: డిప్యూటీ సీఎం ఇంట్లో దొంగతనం ఎలా జరిగిందో తెలుసా? దొంగలు వీరే!

'హైడ్రా హైరానాతో రెండు నెల‌ల్లో హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ ప‌డిపోయింది. రిజిస్ట్రేష‌న్లు ప‌డిపోయాయి. ఆదాయం త‌గ్గిపోయింది' అని కేటీఆర్‌ తెలిపారు. 'అయ్యా... నువ్వు కొత్త‌గా ఆదాయం సృష్టించుడు లేకుంటే పాయే. కానీ ఉన్న‌ది ఊడ‌గొడుతున్న‌వ్. ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేస్తున్నావో అర్థ‌మైతుందా?' అని కేటీఆర్‌ ప్రశ్‌నించారు. 'నీ ఫోర్ బ్ర‌ద‌ర్ సిటీపై ఫోక‌స్ చేసి అక్క‌డ కృత్రిమ రియ‌ల్ బూమ్ కోసం ఆలోచిస్తున్న‌ట్లున్న‌వ్. సామాన్యులు కొనుగోలు, అమ్మ‌కం లేనిది బూమ్ ఎట్లా వ‌స్త‌ది? ఆదాయం ఎట్లా పెరుగుత‌ది?' అని సందేహం వ్యక్తం చేశారు. 

'ఏం చేద్దాం అనుకుంటున్న‌వ్ స్వామి తెలంగాణ‌ను!' అంటూ రేవంత్‌ రెడ్డిని కేటీఆర్‌ సూటిగా ప్రశ్నించారు. మరో ట్వీట్‌లో రేవంత్‌ రెడ్డి పాలనలో 'డబ్బులు లేవు' అనే అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. 'మింగ మెతుకు లేదు కానీ మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావాలె అన్నట్టునది రేవంత్ వైఖరి. తెల్లారి లేస్తే బీద అరుపులు. రాష్ట్రం అప్పులపాలైంది అని, డబ్బులు లేవని' అంటూనే మరొకవైపు మూసీ పేరిట ఈ రూ.లక్ష యాభై వేల కోట్ల సోకులు, ఆర్భాటం ఎవరికోసం?' అని నిలదీశారు. 'రుణమాఫీ, రైతు బీమా, రైతుబంధు, ఉపకార వేతనాలు, పింఛన్ల పెంపు, విద్యాలయాలకు నిధులు' వంటి అంశాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ఏ శాఖకు.. ఏ పనికి కూడా డబ్బులు లేవని చెబుతున్న ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరును కేటీఆర్‌ తప్పుబట్టారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Telangana Revenue Collapsed Ex Minister KT Rama Rao Straight Questioned To Revanth Reddy Rv
News Source: 
Home Title: 

KTR HYDRAA: 'తెలంగాణ‌ను ఏం చేద్దామనుకుంటున్న‌వ్ స్వామి?'

KTR HYDRAA: 'తెలంగాణ‌ను ఏం చేద్దామనుకుంటున్న‌వ్ స్వామి?'
Caption: 
KT Rama Rao HYDRAA
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
KTR HYDRAA: 'తెలంగాణ‌ను ఏం చేద్దామనుకుంటున్న‌వ్ స్వామి?'
Ravi Kumar Sargam
Publish Later: 
No
Publish At: 
Monday, October 7, 2024 - 18:20
Created By: 
Ravi Kumar Sargam
Updated By: 
Ravi Kumar Sargam
Published By: 
Ravi Kumar Sargam
Request Count: 
33
Is Breaking News: 
No
Word Count: 
304