TS RTC Ticket Price Hiked: పెట్రోల్-డీజిల్ పెరుగుదల, గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదల, వంట నూనెల పెరుగుదల, నిత్యావసర ధరల పెరుగుదల.. సామాన్యుడి పై రోజు రోజు భారం పెరుగుతూనే ఉంది. వీటికి తోడుగా సినిమా టికెట్ల రేట్ల పెరుగుదల.. సామాన్యుడికి వినోదమే కాదు.. తినే తిండి కూడా అలోచించి తినాల్సి వస్తుంది.
మొన్నటి వరకు కరోనా కారణంగా ఆర్ధిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నవారు ఇపుడు పెరిగిన ధరల కారణంగా అన్ని విధాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇపుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వలన కేవలం భారత్ పైనే కాక అన్ని దేశాలపై ఈ ప్రభావం పడుతుంది. కారణం ఏదైనా.. కారకులు ఎవరైనా.. సామాన్యుడి బ్రతుకు బండి నడపటానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది.
ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఆర్టీసీ ప్రజలపై మరో భారం మోపింది.. అదేంటంటే బస్సు టికెట్ల ధరలను పెంచటం.. ఇపుడు తెలంగాణ ప్రజల వాసుల పరిస్థితి ఎలా ఉందంటే.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు నిత్యావసర వస్తువుల ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలపై టీఎస్ ఆర్టీసీ ప్రజలపై మరో పిడుగు వేసింది. ఇంధన ధరలు భారీగా పెరుగుతుడడంతో అన్నిరకాల బస్సు ఛార్జీలను తాజాగా పెంచింది టీఎస్ ఆర్టీసీ. ఇటీవలే సెఫ్టీ పేరుతో టికెట్‌పై రూపాయి పెంచి.. చిల్లర సమస్య రాకుండా ధరను రౌండాఫ్ చేయటంతో గరిష్టంగా టికెట్ రెట్ పెరిగింది.
తాజాగా మరోసారి తెలంగాణ ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచింది. ప్యాసింజర్ సెస్ పేరుతో ఎక్సెప్రెస్, డీలక్స్ బస్సుల్లో 5 రూపాయలు..సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో 10 రూపాయల వరకు టికెట్ రెట్లు పెరిగాయి. పెరిగిన బస్సు ఛార్జీలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలంగాణ ఆర్టీసీ వెల్లడించింది. 10 రోజుల వ్యవధిలోనే మరోసారి అకస్మాతుగా ఛార్జీలు పెంచడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also read: PVR-Inox Mega Merger: మల్టీప్లెక్స్ ఇండస్ట్రీలో మెగా విలీనం... ఒక్కటైన పీవీఆర్, ఐనాక్స్
Also read: Ola E-scooter Fire: ఓలా ఈ-స్కూటర్లో మంటలు- వైరల్ అవుతున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook