TS TET 2022: తెలంగాణ టెట్ ఫలితాల విడుదల వాయిదా.. అభ్యర్థుల్లో ఆందోళన

TS TET 2022: అభ్యర్థులు భయపడుతున్నట్లే జరిగింది. తెలంగాణ టెట్ ఫలితాల విడుదల వాయిదా పడింది. ఫలితాల విడుదల ఎప్పుడో కూడా విద్యాశాఖ తెలపలేదు. ముందుకు చెప్పిన జూన్ 27న టెట్ ఫలితాలు విడుదల చేయడం లేదని టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. ఫలితాల విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.

Written by - Srisailam | Last Updated : Jun 27, 2022, 07:04 AM IST
  • తెలంగాణ టెట్ ఫలితాలపై గందరగోళం
  • ఫలితాల విడుదల వాయిదా
  • ఇంకా విడుదల కానీ టెట్ ఫైనల్ కీ
TS TET 2022: తెలంగాణ టెట్ ఫలితాల విడుదల వాయిదా.. అభ్యర్థుల్లో ఆందోళన

TS TET 2022: అభ్యర్థులు భయపడుతున్నట్లే జరిగింది. తెలంగాణ టెట్ ఫలితాల విడుదల వాయిదా పడింది. ఫలితాల విడుదల ఎప్పుడో కూడా విద్యాశాఖ తెలపలేదు. ముందుకు చెప్పిన జూన్ 27న టెట్ ఫలితాలు విడుదల చేయడం లేదని టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. ఫలితాల విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే టైం లోనే జూన్27 న ఫలితాలు విడుదల చేస్తామని వెబ్ సైట్ లో పెట్టారు అధికారులు. కాని సమయానికి ఫలితాలు ఇవ్వడంలో విఫలమయ్యారు. టెట్ ఫైనల్ కీ ఇంకా విడుదల కాలేదు. ఫలితాలు విడుదల మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది. దీంతో టెట్ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.

తెలంగాణలో ఉద్యోుగల భర్తీ కొనసాగుతోంది. వివిధ శాఖల్లో ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తున్నారు. విద్యాశాఖలో భారీగా ఖాళీలు ఉన్నాయి. అయితే టీచర్ పోస్టుల భర్తీకి టెట్ అర్హత కంపల్సరీ. దీంతో ఐదేళ్ల తర్వాత టెట్ నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. ఉపాద్యాయ అభ్యర్థులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 12న టెట్ పరీక్ష జరిగింది.  ఉదయం పేపర్ 1.. మధ్యాహ్నాం పేపర్ 2 నిర్వహించారు. జూన్ 27న ఫలితాలు విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. జూన్ 15  న ప్రాథమిక కీ వచ్చింది. 18 వ తేదీ వరకు ప్రాథమిక కీ పై అభ్యంతరాలు స్వీకరించారు. టెట్ పరీక్షా పేపర్లలో చాలా తప్పులు దొర్లాయి. దీంతో అభ్యర్థుల నుంచి భారీగానే అభ్యంతరాలు వచ్చాయి. వాటిని పరిశీలించి తుది కీ ఇవ్వాల్సి ఉంటుంది. ఫైనల్ కీ వచ్చాకే ఫలితాలు విడుదల చేశారు. కాని అధికారులు ఇప్పటి వరకూ టెట్ ఫైనల్  కీ  విడుదల చేయలేదు.

ప్రాథమిక కీ టెట్ పేపర్ 1 లో 5  సమాధానాలపై అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పేపర్ 2 లోని ఫైనల్ కీ 5 సమాధానాల్లోనూ తప్పులు ఉన్నాయని చెబుతున్నారు.ఈ మార్పులు చేశాకే ఫైనల్ కీ విడుదల చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. అయితే కీ విషయంలోనూ విద్యాశాఖ అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదు. అభ్యర్థుల అభ్యంతరాలు పరిశీలనలోకి తీసుకున్నారా... ఫలితాలు విడుదల ఎందుకు ఆలస్యం అవుతుంది అన్న విషయాల్లో స్పష్టత ఇవ్వడం లేదు. ఫైనల్ కీ ఇప్పుడు ఇస్తారన్నది చెప్పడంతో లేదు. దీంతో అధికారుల తీరుపై టెట్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.  టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్ లో టెట్ మార్కులకు వెయిటేజీ ఉంటుంది. అందుకే టెట్ పరీక్ష చాలా కీలకం. అయినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.

Read also: Privatization: దేశంలో కొనసాగుతున్న ప్రైవేటీకరణ, టాటా చేతికి చిక్కిన మరో కంపెనీ

Read also: Telangana Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలపై వీడిన ఉత్కంఠ..28న ఫలితాలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News