Harish Rao: 'ఒమిక్రాన్​ను​ ఎదుర్కొనేందుకు రెడీ- ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి'

Harish Rao: దేశంలోకి ఒమిక్రాన్​ థార్డ్ వేవ్​ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. అయితే ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 3, 2021, 01:36 PM IST
  • రాష్ట్రంలోకి ఇంకా ఒమిక్రాన్ రాలేదన్న మంత్రి హరీశ్​ రావు
  • ప్రజలు అనవసరంగా ఆందోళన చెందొద్దని సూచన
  • ఒమిక్రాన్​, థార్డ్ వేవ్​ను ఎదుర్కనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడి
Harish Rao: 'ఒమిక్రాన్​ను​ ఎదుర్కొనేందుకు రెడీ- ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి'

Harish Rao: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ఇంకా తెలంగాణలోకి రాలేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు స్పష్టం చేశారు. ప్రజలవెవ్వరు అనవసరంగా ఆందోళన చెందొద్దని సూచించారు. 11 అనుమానిత దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించి.. నెగెటివ్​గా తేలితేనే ఇళ్లకు (COVID test in Hyderabad Airport) పంపిస్తున్నట్లు వివరించారు. పాజిటివ్​గా తేలితే అక్కడి నుంచి నేరుగా టిమ్స్​ దవాఖానకు పంపిస్తున్నట్లు వెల్లడించారు హరీశ్​.

సికింద్రాబాద్​ ఓల్డ్ బోయిన్​పల్లిలో బస్తీ దవాఖానను ప్రారంభించిన హరీశ్​ రావు. ఈ విషయాలను పంచుకున్నారు. హైదరాబాద్​లో బస్తీ దవాఖానలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు (Health minister Harish Rao) హరీశ్​ రావు. 15వ ఆర్థిక సంఘం కూడా దేశమంతా ఈ విధానాన్ని అమలు చేయాలని సూచించినట్లు గుర్తు చేశారు.

హైదరాబాద్​లో 258 బస్తీ దవాఖానలు..

బస్తీల్లో ఉండే సుస్తీని దూరం చేసేవే బస్తీ దవాఖానాలు (Basti Dawakana) అని హరీశ్​ చెప్పుకొచ్చారు. ఇవాళ ఒక్క రోజే 32 కొత్త బస్తీ దవాఖానాలను ప్రారంభించినట్లు వివరించారు. ఇది వరకే 226 దవాఖానలు అందుబాటులో ఉన్నట్లు (Total Basti Dawakanas in Hyderabd) వెల్లడించారు.

హైదరాబాద్​లో బస్తీ దవఖానల మోడల్​ పెట్టాలని జిల్లాల నుంచి కూడా డిమాండ్ వస్తున్నట్తు హరీశ్​ వివరించారు. దీనితో రానున్న రోజుల్లో 144 బస్తీ దవాఖానలను రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
బస్తీ దవాఖానల్లో అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని.. అందుకే అనవసరంగా ప్రైవేటుకు వెళ్లొద్దని సూచించారు హరీశ్​ రావు. హైదరాబాద్​లో 20 టీ డయాగ్నోస్టిక్ సెంటర్లను పెట్టినట్లు వివరించారు. బస్తీ దవాఖానల్లో ఒక్క పైసా ఖర్చు లేకుండా పరీక్షలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఒమిక్రాన్​ ఎదుర్కనేందుకు సిద్ధమే.. కానీ..

రాష్ట్రంలోకి ఇంకా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ రాలేదని స్పష్టం చేసిన (Omicron in Telangana) హరీశ్​ రావు. ఒక వేళ ఒమిక్రాన్, థార్డ్​ వేవ్​ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. బ్రిటన్ నుంచి వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్​గా తేలిందని.. అయితే అమెకు ఒమిక్రాన్ సోకిందా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది పేర్కొన్నారు.

మూడో వేవ్​ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్క్​లు ధరించడం, శుభ్రంగా ఉండటం, టీకాలు వేసుకోవడం ద్వారా కరోనాను ఎదుర్కోవచ్చని తెలిపారు. కరోనా వచ్చిన తర్వాత ఇబ్బంది పడే కంటే ముందే జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇక కరోనా ఎదుర్కొనేందుకు.. ఐసీయూ, ఆక్సిజన్ సదుపాయాలలతో కూడిన​ 27 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు హరీశ్​.

అర్హులంతా టీకా వేసుకోవాలి..

రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు కరోనా టీకా వేసుకోవాలని సూచించారు. టీకా వేసుకోని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిటి వాక్సిన్ తీసుకునేలా చేయాలని బస్తీల పెద్దలకు సూచించారు. తెలంగాణ వ్యాప్తంగ ఇప్పటి వరకు 2 కోట్ల 51 లక్షల మంది మొదటి డోస్​ వేసుకున్నట్లు తెలిపారు. అంటే దాదాపు 91 శాతం మందికి ఫస్ట్ డోస్ పూర్తయినట్లు వివరించారు. కోటు 32 లక్షల మంది రెండో డోసు టీకా వేసుకున్నట్లు వివరించారు హరీశ్​.

Also read: Telangana: గురుకులంలో కరోనా కలకలం..29 మంది విద్యార్థినులకు పాజిటివ్!

Also read: Face Mask Mandatory: 'మాస్క్​ లేకుండా బయటికొస్తే రూ.1000 జరిమానా': తెలంగాణ ప్రభుత్వం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News