Rain Alert for Telangana: తెలంగాణ వాసులకు అలర్ట్. ఇవాళ, రేపు కూడా రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 06వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి.. దాని ప్రభావంతో అదే ప్రాంతంలో 07న అల్పపీడనం ఏర్పడే వీలుందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం అగ్నేయ బంగాళాఖాతంలో 08న వాయుగుండంగా కేంద్రకృతమవుతుందని అధికారులు గురువారం వెల్లడించారు.
ప్రస్తుతం ఇది ఉత్తర దిశగా అంటే మధ్య బంగాళాఖాతం వైపు కదులుతూ తుపానుగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ఎఫెక్ట్ కారణంగా తెలంగాణ వ్యాప్తంగా మే 08వ తేదీ నుంచి పొడి వాతావరణం ఏర్పడి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది. నిన్న ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవగా.. రాజన్నసిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల, నాగర్‌కర్నూలు, కామారెడ్డి, వికారాబాద్, కుమురంభీం, ములుగు, మంచిర్యాల జిల్లాల్లో స్వల్ప వర్షపాతం రికార్డు అయింది.
ఈ అల్పపీడన ద్రోణి ప్రభావం ఏపీపైన చూపించనుంది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా పడే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK