ప్యారిస్ నగరంలో ఆదివారం గుర్తుతెలియని ఓ వ్యక్తి ఏడుగురిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో గాయపడ్డ నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంగంతకుడు ముందు ఇనుప రాడ్డుతో అందరిని బెదిరించాడు. తర్వాత కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఉగ్రవాద కోణం లేదని పోలీసులు వెల్లడించారు. కాగా దాడికి గురైన వారిలో ఇద్దరు యూకేకు చెందిన యాత్రికులు ఉన్నట్లు సమాచారం.
దాడికి తెగబడ్డ అగంతకుడిని పట్టుకొని అరెస్టు చేసినట్లు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. కాగా ఆగంతకుడు ఆఫ్ఘనిస్థాన్ దేశ పౌరుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీధిలో తిరిగే అపరిచితులే లక్ష్యంగా ఆగంతకుడు దాడి చేసినట్లు.. ఈ దాడిలో ఏడుగురు గాయపడినట్లు.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ సంఘటన రాజధాని ఈశాన్య ప్రాంతంలో ఒక కాలువ ఒడ్డున రాత్రి 11 గంటల తర్వాత జరిగింది. ప్రత్యక్ష సాక్షి కథనం మేరకు.. అగంతకుడిని ఆపడానికి ఇద్దరు మనుషులు ప్రయత్నించడం చూశానని, అతడ్ని వెంటాడేటప్పుడు ఇనుప రాడ్ విసిరివేశాడని.. తర్వాత కత్తితో దాడికి తెగబడినట్లు చెప్పాడు. పోలీసు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.